ఆరెస్సెస్‌ ఆదేశాలతో బీజేపీ హిందుత్వ ఎజెండా | CPI MP D Raja comments on BJP GOVT | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్‌ ఆదేశాలతో బీజేపీ హిందుత్వ ఎజెండా

Published Thu, May 4 2017 3:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆరెస్సెస్‌ ఆదేశాలతో బీజేపీ హిందుత్వ ఎజెండా - Sakshi

ఆరెస్సెస్‌ ఆదేశాలతో బీజేపీ హిందుత్వ ఎజెండా

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్‌ ఆదేశాలకు లోబడి ప్రజలపై హిందూత్వ ఎజెండాను ప్రయోగి స్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యు డు, ఎంపీ డి.రాజా ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్‌ :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్‌ ఆదేశాలకు లోబడి ప్రజలపై హిందూత్వ ఎజెండాను ప్రయోగి స్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యు డు, ఎంపీ డి.రాజా ఆరోపించారు. బుధవా రం ఇక్కడ మగ్దూంభవన్‌లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. మూడేళ్ల మోదీ పాలనలో ఆరెస్సెస్‌ కీలక భూమికను నిర్వహిస్తోందని అన్నారు. మోదీ నినాదం ‘సబ్‌ కా సాథ్, సబ్‌కా వికాస్‌’ కాస్తా కార్పొరేట్‌కే సాథ్, కార్పొరేట్‌ వికాస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.  

హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజాస్వామ్య, లౌకికపార్టీలు, సామాజిక సంస్థలు విస్తృత ప్రాతిపదికన వేదికపైకి వచ్చి ఐక్య ప్రజాఉద్యమాలను చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపే విషయంపై ఏకాభిప్రాయానికి రావాలని రాజా సూచించారు. హైదరాబాద్‌లో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌ న్యాయమైనదని అన్నారు. ధర్నాచౌక్‌ తరలింపు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పునరాలోచించి, దానిని అక్కడే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement