
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలి
కార్మికుల సొమ్ముతో విద్యా వ్యాపారం చేస్తున్న నల్ల మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఎం...
సీపీఎం కార్యదర్శి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సొమ్ముతో విద్యా వ్యాపారం చేస్తున్న నల్ల మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని విజ్ఞప్తి చేశారు. ఘట్‌కేసర్ సమీపంలోని కాచవాని సింగారంలో సింగరేణి కార్మికులు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయగా, వాటి డెవలప్‌మెంట్ చార్జీల నిమిత్తం నల్ల మల్లారెడ్డి డబ్బులు వసూలు చేసి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు.
ఎవరైనా ప్లాట్ అమ్ముకునేందుకు వెళితే ప్రైవేట్ సైన్యంతో వేధింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. ఆక్రమించుకున్న ప్లాట్లను యజమానులకు తిరిగి అప్పగించాలని కోరారు. మల్లారెడ్డి, ఆయన రియల్ ఎస్టేట్ సంస్థపై వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.