![Cv anand on GST frauds - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/6/nand.jpg.webp?itok=RXeY5j9P)
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ మోసాలపై తూనికలు, కొలతల శాఖ దాడులను ముమ్మరం చేసింది. ప్రజల నుంచి గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే అధికమొత్తంలో వసూలు చేస్తుండటంతో ఆ శాఖ తనిఖీలు విస్తృతం చేసింది. ఇందులోభాగంగా గత వారంలో 5 వేల వ్యాపార సంస్థలపై దాడులు చేశామని, 1,062 కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ కంట్రోలర్ సీవీ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈక్రమంలో చిన్నపాటి వర్తక సంస్థలే కాక పెద్ద వ్యాపార సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లో జరుగుతున్న మోసాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ సెంట్రల్, పీవీఆర్ సినిమా, కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్, ప్రసాద్ ఐమ్యాక్స్, సబ్‌వే ఫుడ్‌కోర్ట్, సుజనామాల్, బ్లూఫాక్స్ రెస్టారెంట్, శాన్‌భాగ్, గోల్కొండ, పార్క్ హోటళ్లు తదితర వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
వీటిల్లో ఎంఆర్‌పీ కంటే అధికంగా జీఎస్టీని కలిపి విక్రయాలు చేస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. జీఎస్టీ మోసాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే మొదటిసారి రూ.25 వేల జరిమానా, రెండోసారి కూడా మోసాలకు పాల్పడితే జరిమానాను రెండింతలు పెంచుతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment