సాయిలు, ఫోన్‌కు వచ్చిన మెస్సేజ్‌లు, ఏటీఎం కార్డు
సాక్షి, కొల్చారం(నర్సాపూర్): ఒక్క ఫోన్‌కాల్‌తో ఖాతాదారుని ఖాతాలో ఉన్న రూ.25వేలు ఖాళీ అయిన సంఘటన కొల్చారం మండలం పైతర గ్రామంలో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పొలంలో దుక్కిదున్నతున్న పైతర గ్రామానికి చెందిన కమ్మరి సాయిలుకు మొబైల్ నెం.87891 29706 నుంచి గురువారం సాయంత్రం ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తాను ఎస్‌బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, మీ ఏటీఎంకార్డు ఫేయిల్ అయింది. రేపు కొత్తకార్డు వస్తుంది. అని అపరిచిత వ్యక్తి తెలిపాడు. దీంతో సాయిలు తాను పొలం పనుల్లో ఉన్నానని, 40 నిమిషాల తరువాత ఫోన్ చేయమని చెప్పాడు.
ఏటీఎం నెంబర్ చెప్పడంతో..
అప్పటికి ఇంటికి చేరుకున్న సాయిలుకు అదే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడం, మీ ఏటీఎం కలర్ బ్లాక్ రంగులోఉందని చెప్పడం, మీకొత్త ఏటీఎం నెంబర్ నమోదు చేసుకొండని చెప్పడంతో సాయిలు ఆ నెంబర్‌ను నోట్‌చేసుకున్నాడు. అనంతరం మీ ఏటీఎం నెంబర్ చెప్పాలని అవతలి వ్యక్తి అడగటంతో ఏటీఎం వెనక గల మూడు నెంబర్లు సైతం తెలపాలని సూచించడంతో సాయిలు పూర్తి వివరాలు అందజేశాడు.
వెంటనే ఖాతాలోంచి డబ్బు మాయం
ఇంతలోనే తన ఖాతాలో నుంచి మూడుసార్లు డబ్బులు డ్రా చేసినట్లు మేసెజ్‌లు రావడం, మొత్తం రూ.25వేలు ఖాతాలో నుంచి ఖాళీ కావడంతో అప్రమత్తమైన సాయిలు అదే వ్యక్తికి మరోసారి మీ ఇంట్లోని వారి ఏటీఎం నెంబర్లు చెప్పండని అడగటంతో తన అల్లుడికి ఫోన్‌చేసి వివరాలు తెలిపాడు. అది మోసం అంటూ సమాధానం రావడంతో సాయిలు అయోమయంగా మారింది. తాను పంటపెట్టుబడి కోసం బ్యాంకులో డబ్బులు దాచుకోవడం జరిగిందని, ఇలా మోసపోతానని అనుకోలేదని సాయిలు వాపోయాడు. ఈ విషయమై కొల్చారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సాయిలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment