సాక్షి,కాజీపేట అర్బన్: కేసీఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో ప్రజల చూపు టీఆర్‌ఎస్ వైపు మళ్లిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. హన్మకొండలోని పార్టీ అర్బన్ కార్యాలయంలో గురువారం కాజీపేట 35వ డివిజన్‌కు చెందిన ఇమ్మడి రవితో పాటు 200 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వినయ్‌భాస్కర్ టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. శిరుమల్ల దశరథం, ఇమ్మడి ఎలిశా, నార్లగిరి ర మేష్, గబ్బెట శ్రీనివాస్, సిలువేరు మల్లికార్జున్, రాంచందర్, రోహిత్, ఠాకూర్, కుమారస్వామి,ఎండీ.అఫ్జల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment