vijayabaskar
-
ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే భర్త మోసాలు
రంపచోడవరం: అధికారం లేనప్పుడే ఉద్యోగాల పేరుతో గిరిజన యువతను మోసం చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త మఠం విజయ భాస్కర్ అధికారంలోకి వచ్చిన తరువాత మరింతగా రెచ్చిపోతున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రంపచోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే, రంపచోడవరం ఎమ్మెల్యే తీరుపై అంతకు పదిరెట్లు వ్యతిరేకత ఏజెన్సీ ప్రజల నుంచి వ్యక్తమవుతోందని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్‌పై ప్రసారం చేసిన కథనాన్ని ప్రదర్శించారు. బహుశా టీడీపీకి నష్టం జరుగుతుందనే ఇలా ప్రసారం చేసుంటారని ఆమె చెప్పారు. అధికారం లేనప్పుడే విజయభాస్కర్‌పై ఎనిమిది పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎన్నికల ముందు రాజవొమ్మంగికి చెందిన టీడీపీ నేతలు వీరి చేతిలో ఎలా మోసపోయారో బహిరంగంగానే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే భర్త ప్రవర్తనతో అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా 2023లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయభాస్కర్ డబ్బులు తీసుకున్న ఫోన్‌పే స్క్రీన్ షాట్లను మీడియాకు చూపించారు. బాధితులు మాట్లాడిన వాయిస్‌లను వినిపించారు. విజయభాస్కర్‌పై గుండాట, పేకాట కేసులు ఉన్నాయని తెలిపారు. 2022లో అనంతగిరిలో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తుండగా ఇద్దరు అమ్మాయిలను పట్టుకున్నారని, ఆ కేసులో భాస్కర్ ఏ–1 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళకు చెందిన సొమ్ము నేరుగా అతని అకౌంట్‌కు పంపించుకోవడం విజయభాస్కర్ అక్రమాలకు పరాకాష్ట అన్నారు. తిమ్మాపురంలో ఇసుక తవ్వుకునేందుకు కాలువకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఎమ్మెల్యే, ఆమె భర్తకు సంబంధం లేదా? అని ప్రశ్నించారు. రంగురాళ్ల క్వారీలను తిరిగి తవ్వేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్‌శాఖలో బదిలీల కోసం రేట్లు ఫిక్స్ చేశారనే ఆరోపణలూ ఉన్నాయన్నారు. విజయభాస్కర్ మాట వినని అధికారులను గంజాయి కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
టీఆర్ఎస్ వైపు.. ప్రజల చూపు
సాక్షి,కాజీపేట అర్బన్: కేసీఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో ప్రజల చూపు టీఆర్ఎస్ వైపు మళ్లిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. హన్మకొండలోని పార్టీ అర్బన్ కార్యాలయంలో గురువారం కాజీపేట 35వ డివిజన్‌కు చెందిన ఇమ్మడి రవితో పాటు 200 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వినయ్‌భాస్కర్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. శిరుమల్ల దశరథం, ఇమ్మడి ఎలిశా, నార్లగిరి ర మేష్, గబ్బెట శ్రీనివాస్, సిలువేరు మల్లికార్జున్, రాంచందర్, రోహిత్, ఠాకూర్, కుమారస్వామి,ఎండీ.అఫ్జల్ పాల్గొన్నారు. -
‘భాస్కరుడి’కి అమ్మ అభయం
చెన్నై : ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌కు సీఎం జయలలిత అభయహస్తం ఇచ్చారు. ఇంటెలిజెన్స్ విచారణ మంత్రికి అనుకూలంగా రావడంతో పదవీ గండం తప్పినట్టు అయింది. కులచిచ్చుతో వీరంగం సృష్టించే వాళ్లకు చెక్ పెట్టే రీతిలో మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు అమ్మ ఉద్వాసన పలకడం అన్నాడీఎంకే వర్గాలకు షాక్ ఇచ్చినట్టు అయింది. అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తరచూ మంత్రివర్గంలో మార్పులు జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం మంది మంత్రులపై వచ్చిన పలు రకాల ఆరోపణలు, ఫిర్యాదులే కారణంగా చెప్పవచ్చు. ఏ మంత్రిపైన అయినా సరే చిన్న పాటి ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే చాలు తక్షణం జయలలిత స్పందించడం జరుగుతోంది. మంత్రిపై ఫిర్యాదులు వచ్చినా, ఆయనకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు వచ్చినా, అన్నాడీఎంకే కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చినా, ఆయా జిల్లాల్లోని నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కినా ఆ మంత్రి పదవి ఊడినట్టే. మరోచాన్స్ అంటూ లేని రీతిలో పదవులు ఊడుతూ వస్తున్నాయి. కొందర్ని క్షమించి మళ్లీ ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా జయలలిత నమ్మిన బంట్లు, పలువురు ముఖ్య, కీలక నాయకుల పదవులు ఊడిన సందర్భాలు అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మంత్రికి వ్యతిరేకంగా కొన్ని జిల్లాల్లో ఏకంగా కుల వివాదాలతో చిచ్చు రగిలినా చివరకు పదవీ గండం నుంచి ఆ మంత్రి తప్పించుకోవడం గమనార్హం. ఆరోగ్య మంత్రి విజయ్‌కు ఉద్వాసన పలికిన తర్వాత ఆ శాఖకు పుదుకోట్టై జిల్లా విరాళి మలై ఎమ్మెల్యే విజయ భాస్కర్‌కు అప్పగించారు. స్వతహాగా వైద్యుడు కావడంతో విజయ భాస్కర్ ఆరోగ్య శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు. రెండేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత నెల సొంత జిల్లా పుదుకోట్టైలో మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే బయలుదేరింది. తమను కులం పేరుతో దూషించారంటూ కరంబక్కుడి పంచాయతీ యూనియన్ మాజీ కార్యదర్శి చొక్కలింగం, ఆయన భార్య, ఆ యూనియన్ అధ్యక్షురాలు గంగయ్యమ్మాల్ ఆరోపించడం వివాదాస్పదమైంది. ముత్తయ్యార్ సామాజిక వర్గం ఏకం కావడంతో మంత్రికి వ్యతిరేకంగా ఉద్యమం బయలుదేరింది. పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, మదురైలోని ఆ సామాజిక వర్గం ఏకమై మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పు అనివార్యం అన్న ప్రశ్న బయలుదేరింది. సమగ్ర విచారణకు ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ విచారణలో రాజకీయ లాభం కోసం కులచిచ్చును తెర మీదకు తెచ్చారని, దీని వెనుక డీఎంకే హస్తం ఉందని తేలింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన అమ్మ పార్టీలో కుల చిచ్చు, వివాదాలకు చెక్ పెట్టే రీతిలో ఆగమేఘాలపై చొక్కలింగం, గంగయ్యమ్మాల్కు ఉద్వాసన పలికారు. ఆ ఇద్దర్నీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఇతర నేతల్లో గుబులు బయలు దేరింది. చివరకు పదవి గండం నుంచి విజయ భాస్కర్ తప్పించుకుని అమ్మ అభయం పొందారు. ఇక ముత్తయ్యార్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే రీతిలో డీఎంకే ఎంపి కనిమొళి పావులు కదపడం గమనార్హం. ఆ ఇద్దర్నీ తమ వైపునకు తిప్పుకుని ఆ సామాజిక వర్గం మద్దతు కూడగట్టుకునే రీతిలో ప్రయత్నాలు సాగించే పనిలో పడ్డట్టు సమాచారం.