![గవర్నర్‌తో దత్తాత్రేయ భేటీ](/styles/webp/s3/article_images/2017/09/3/71428610021_625x300.jpg.webp?itok=_PhSrNYz)
గవర్నర్‌తో దత్తాత్రేయ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యా రు. గురువారం రాజ్‌భవన్‌లో దాదాపు అరగంటపాటు గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించారు. శేషాచలం అడవుల్లో జరి గిన ఎన్‌కౌంటర్, వరంగల్, నల్లగొండ సరిహద్దుల్లో జరి గిన ఘటనతో పాటు సూర్యాపేట, జానకీపురం ఘటనలపై దత్తాత్రేయ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం, పోలీసుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు.