దేవరకద్ర: దేవరకద్రలోని రైల్వేగేట్‌ను సోమవారం రాత్రి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో గేటు ఓ పక్కకు వంగి పోయింది. ఈ సందర్భంగా సైరన్ అదేపనిగా మోగడంతో రైల్వే గేట్ పడుతుందేమోనని వాహనదారులు ఉరుకులు, పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వచ్చి సైరన్‌ను నిలిపివేశారు. అలాగే, వంగిపోయిన గేటు మరమ్మతులకు యత్నించగా పనులు పూర్తికాలేదు. దీంతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను కాషన్ సిగ్నల్‌తో నడిపించారు. గేట్ వేయకుండానే సిగ్నల్ ఇస్తూ రైళ్లను ముందుకు కదిలించారు. కాగా, రాత్రి పొద్దుపోయే వరకు కూడా గేటు మరమ్మతు పూర్తికాకపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment