వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి | death of the young man fell into a well on the farm | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి

Published Thu, Mar 16 2017 4:04 AM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM

death of the young man fell into a well on the farm

ఆత్మకూరు(ఎం): వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వాకిటి శివకుమార్‌రెడ్డి(19) రెండు రోజుల క్రితం తన బంధువైన మండల కేంద్రంలోని యాస వెంకట్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి  గ్రామానికి చెందిన సత్తిరెడ్డి వ్యవసాయ బావి వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలోనే మూత్ర విసర్జన చేసేందుకు శివకుమార్‌రెడ్డి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో కాసేపటికే నీటిలో మునిగిపోయాడు.

అయితే శివకుమార్‌రెడ్డి బావిలో పడిన విషయం గుర్తించిన స్నేహితులు ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ అంతా చీకటిగా ఉండడం.. సహాయం అందించేందుకు తాడు కూడా అందుబాటులో లేదు. కాసేపటికి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బావిలో గాలించగా అప్పటికే శివకుమార్‌రెడ్డి మృతిచెందాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తల్లి వాకిటి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి. శివనాగప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement