అచ్చంపేట : తెలంగాణలో ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ ఢిల్లీ తరహా ఫలితాలే పునరావృతమవుతాయని మాజీ మంత్రి, టీడీపీ నేత పి.రాములు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలి పాలన సాగిస్తోందని మండిపడ్డారు. టీడీపీ నాయకులను టీఆర్‌ఎస్ లక్ష్యం చేసుకుని వారిని తమ పార్టీలో కలుపుకుంటోందన్నారు.
విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, పత్తి రైతులను సర్కారు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న అచ్చంపేటలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని తెలిపారు.