
కాల్పుల ఘటనపై సమీక్షిస్తున్న డీజీపీ
నల్గొండ : నల్గొండ జిల్లా సూర్యాపేటలో గుర్తుతెలియని దుండగులు పోలీసులపై కాల్పులు జరిపిన నేపథ్యంలో డీజీపీ అనురాగ్ శర్మ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. పోలీసులు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. నిందితుల కోసం శుక్రవారం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. కాల్పుల్లో గాయపడిన సీఐ పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఓ హోంగార్డు, ఓ కానిస్టేబుల్ మృతిచెందిన విషయం తెలిసిందే.