ధనుర్మాసోత్సవాలు ప్రారంభం | Dhanurmasa Utsavalu started in Bhadrachalam Temple | Sakshi
Sakshi News home page

ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

Published Wed, Dec 17 2014 6:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం ధనుర్మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ అర్చకులు తీసుకొచ్చిన బిందెను అంతరాలయంలో ఉంచారు. ఆ తరువాత స్వామి వారి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు, యాగబేరమూర్తులకు, నిత్య కల్యాణ మూర్తులకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు.  స్వామి వారి కి నివేదన అనంతరం తిరుప్పావై పాశుర విన్నపం ఆచరించారు.
 
 ఉత్సవాల్లో భాగం గా బుధవారం ఆండాళమ్మ వారిని తాతగు డి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం, అష్టోత్తర శతనామార్చన పూజలు జరిపించి మహా పూర్ణాహుతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, స్థానాచార్యులు కెఇస్థల శాయి, వేద పండితులు గుదిమళ్ల మురళీ కృష్ణమాచార్యులు, ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీఆర్‌వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement