
కేసీఆర్‌కు డీఎస్ అమ్ముడుపోతారు: రాజలింగం
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఫ్లోర్‌లీడర్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ పక్షనేతగా డి. శ్రీనివాస్ ఎన్నికను వ్యతిరేకించినట్టు ఎమ్మెల్సీ రాజలింగం వెల్లడించారు. డీఎస్ కౌన్సిల్ సమావేశాలకు హాజరుకారని ఆరోపించారు. కేసీఆర్‌కు డీఎస్ అమ్ముడుపోతారని అన్నారు. డీఎస్ ఎన్నికను వ్యతిరేకించవద్దంటూ పదిలక్షల రూపాయలు పంపిస్తే వెనక్కి పంపానని వెల్లడించారు. హైకమాండ్ పెద్దలు సీనియారిటీ పేరుతో ప్రయోజనం లేని నేతలకు పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
కాగా, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకునే తమను ఎన్నుకున్నారని డీఎస్ తెలిపారు. తమ పార్టీ సోనియా గాంధీని సంప్రదించాకే ఎన్నికైనట్లు ప్రకటించారని చెప్పారు. తాను, షబ్బీర్ అలీ కలిసి పనిచేయాలని అధిష్టాన పెద్దలు నిర్ణయించారని అన్నారు. ఎమ్మెల్సీల మధ్య బేధాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకుపోతామన్నారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని డీఎస్ పేర్కొన్నారు.