సాక్షి, తుర్కపల్లి (ఆలేరు) : రెండు కిడ్నీలు చెడిపోయిన ఓ వ్యక్తి కరోనా కాటుకు గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది, కరోనాను జయించాడు. కాని నాటి నుంచి డయాలసిస్ కష్టాలు మొదలయ్యాయి. ఏం చేయాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నాడు. తనను బతికించాలని వేడుకుంటున్నాడు.
ఏడు సంవత్సరాల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధి..
తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కొమ్మరాజు బాల్‌రాజు తన రజక కులవృత్తిని కొనసాగిస్తూ, మరో వైపు బ్యాండ్ మేళంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం తన రెండు కిడ్నీలు చెడిపోవడంతో వైద్యం చేయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. గత ఐదారు సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
కరోనా బారిన పడి..
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకొని వస్తున్న క్రమంలో.. అదే ఆస్పత్రిలో ఓ కిడ్నీ పేషెంట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో, అదే రోజు డయాలసిస్‌కు వచ్చిన వారు కోవిడ్ – 19 పరీక్షలు చేయించుకోవాలని బాల్‌రాజుకు ఆస్పత్రి నుంచి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో గత నెల 27న కోవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాడు. 29న పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వెంటనే బాల్‌రాజు కుమారుడు 108కు సమాచారం ఇచ్చాడు. బాల్‌రాజును అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 16 రోజుల చికిత్స అనంతరం ఈనెల 15న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా వ్యాధి తగ్గిందని, పరీక్షల అనంతరం వచ్చిన నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు.
వెంటాడుతున్న
డయాలసిస్ కష్టాలు..
మూడు రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాలి్సన అవసరం ఉండడంతో, ఆరు సంవత్సరాల నుంచి తాను పరీక్ష చేయించుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. ప్రస్తుతం తనకు డయాలసిస్ పరీక్షలు చేయబోమని, వేరేచోట చేయించుకోవాలని పంపించారు. ఒకటి, రెండు ఆస్పత్రులు తిరిగినా ఇదే పరిస్థితి ఎదురైంది. చేసేదేమీ లేక ఆలేరులోని ప్రభుత్వ భగవాన్ మహావీర్ జనరల్ లైఫ్ ఫాండేషన్ సెంటర్‌లో డయాలసిస్ పరీక్ష కోసం వెళ్లాడు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా.. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లకి ఇక్క డ డయాలసిస్ చేయ బోమని, హైదరాబాద్‌లోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న చోట చేయించుకోవాలని తిరిగి పంపించారు. తాను డయాలసిస్ ఎక్క డ చేయించుకోవా లో తెలి యని పరిస్థితి ఏర్పడిందని, మూడు రో జు లకోసారి డయాలసిస్ చేయించుకోకపోతే ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సమస్యను పరిష్కరిస్తాం
జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కృషితో ఈ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు అయింది. కరోనా నెగెటివ్ వచ్చిన తరువాత సేవలందించాలి్సన అవసరం ఉంది. జరిగిన సంఘటనపై విచారణ జరిపి బాధితుడి సమస్య పరిష్కరిస్తాం. – సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment