
రాష్ట్రానికి నేడు దిగ్విజయ్
వరంగల్ జిల్లా నేతలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ నేతలతో మరోసారి సమావేశం కానున్నారు. టీపీసీసీ నుంచి జాబితా అందుకున్నా అభ్యర్థిపై అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. వరంగల్ జిల్లా పార్టీ నేతలతో గురువారం దిగ్విజయ్ భేటీ కానున్నారు. పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించనున్నారు. మాజీ ఎంపీ జి.వివేక్‌ను పోటీకి ఒప్పించడానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వివేక్ వైఖరిలో మార్పు లేకుంటే సర్వే సత్యనారాయణ, సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ జి.విజయరామారావు, రాజారపు ప్రతాప్‌లో ఒకరిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. వరంగల్ జిల్లా నేతలతో భేటీ తర్వాత జీహెచ్‌ఎంసీ నేతలతోనూ దిగ్విజయ్ సమావేశం అవుతారు. గ్రేటర్ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకున్నా వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.