విద్యాశాఖ మంత్రుల చర్చలు సఫలం
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సిలింగ్ అంశానికి సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాస్ ల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాథమిక రికార్డ్స్ విషయమై మంగళవారం ఈ ఇద్దరు మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సఫలమైనట్లు భేటీ అనంతరం గంటా తెలిపారు. ఎంసెట్ కౌన్సిలింగ్ సజావుగా సాగేందుకు సానుకూలంగా చర్చించుకున్నామన్నారు.
ఇదిలా ఉండగా ఇరు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం లేకుండా సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కడియం తెలిపారు. విద్యాశాఖ ఫైల్స్, రికార్డులు, ఉద్యోగులు, కంప్యూటర్ల డేటా, విభజన కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఇరు రాష్ట్ర విద్యాశాఖా మంత్రులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పదో షెడ్యూల్‌లోని విద్యాసంస్థల పరిస్థితులపై.... ఆరా తీయాలని వారు నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు.