నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : విద్యాసంవత్సరం ప్రారంభమైనా పాఠ్యపుస్తకాలు అందక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అవస్థలు పడడాన్ని ఇన్నాళ్లు చూశాం. ఈసారి పరిస్థితి మారింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ డెరైక్టర్ పూనం మాలకొండయ్య పుస్తకాల పంపిణీని పకడ్బందీగా చేపట్టారు. దీంతో ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు ముందే జిల్లాకు చేరాయి. జిల్లాలో 465 ఉన్నత పాఠశాలలు, 975 ప్రాథమికోన్నత పాఠశాలు, 1,525 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
వీరికిగాను ఈ ఏడాది విద్యా సంవత్సరానికి 16.45 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 97,450 పుస్తకాలు గత సంవత్సరంవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా 15.60 లక్షల పుస్తకాలు కొత్తగా అవసరమయ్యాయి. ఇప్పటికే 15.51 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని ఆయా పాఠశాలలకు పంపించారు.
పాఠశాలల పునఃప్రారంభం రోజునే..
పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాల పంపిణీపై మంగళవారం తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. అన్ని తరగతుల విద్యార్థులకు అన్ని టైటిల్స్‌ను అందించాలని సూచించారు.
పుస్తకాల పంపిణీ ఈసారి ముందుగానే
Published Wed, May 28 2014 1:38 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement