mala kondaiah
-
ఆ ఇద్దరి వల్లే ఈ స్థాయికి చేరుకున్నా: డీజీపీ నండూరి
సాక్షి, అమరావతి : తాను ఈ స్థాయికి రావడానికి తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు బాలకృష్ణ మూర్తి, రామకృష్ణా రావుల కృషి ఎంతో ఉందని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. ఏడవ తరగతిలో తమ ఉపాధ్యాయుడు రామకృష్ణా రావు చెప్పిన పాఠం తనకు యూపీఎస్సీ పరీక్షలో ప్రశ్నగా వచ్చిందన్నారు. వీడ్కోలు సభలో మాట్లాడుతూ నుండూరి సాంబశివరావు ఉద్వేగానికి లోనయ్యారు. 1984లో సివిల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు. బెల్లంపల్లిలో 1987లో ఏఎస్పీగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయి శాంతిని నెలకొల్పారని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పని చేయగలరనే ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతగానో సహకరించారని, తనకు పదవి ఎప్పుడూ అలంకారం కాదని అన్నారు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కొన్ని కొత్త నిర్ణయాలు, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించానని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎవరినైనా మాటలతో నొప్పించాను కానీ రాతలతో ఎప్పుడూ ఎవరినీ బాధించలేదని చెప్పారు. సాంబశివరావు నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాల కొండయ్య మాట్లాడుతూ.. నండూరి సాంబశివ రావు తనకు ఒక అన్న లాంటి వారని వ్యాఖ్యానించారు. తాను వివిధ శాఖల్లో పనిచేసేటప్పుడు అయిదు సార్లు ఆయన నుంచి బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. తామిద్దరం కాకినాడలో ఒకే ఎస్పీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నామని వెల్లడించారు. నండూరి సాంబశివరావు ఇచ్చిన స్ఫూర్తితో పని చేస్తానని చెప్పారు. సాంబశివరావు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
విలపింఛెన్
కావూరు సుబ్బులు. ఈమె వయసు 88 సంవత్సరాలు. పింఛన్ తొలగించారన్న విషయం తెలియడంతోనే సగం చచ్చిపోయింది. దరఖాస్తు చేసి, సంబంధిత అధికారుల చుట్టూ తిరిగే ఓపిక లేక ఈ నెల 4వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎనిమిది రోజులపాటు మృత్యువుతో పోరాడి 12వ తేదీన మృతి చెందడంతో ఊరూ,వాడా ఒక్కటై సర్కారు తీరును నిరసించింది. రెండు కాళ్లు లేవు... కాళ్లీడ్చుకుంటూ వచ్చాను. నా పేరు పింఛన్ జాబితా నుంచి తొలగిస్తారా... కనికరించండయ్యా అంటూ కళ్లనీళ్ల పర్యంతమైనా అయ్యోపాపం అనే వాళ్లే లేరాయే. కంభం పట్టణం సంగా వీధికి చెందిన సుబ్బమ్మ (70) ఈ నెల 10వ తేదీన ఎంపీడీఓ వద్ద చేసిన ఆర్తనాదం పింఛన్ల కమిటీని కదిలించలేకపోయింది. అద్దంకి మండలం గంగపాలేనికి చెందిన చండ్ర వీరయ్య (72) పదిహేను సంవత్సరాలుగా పింఛన్ తీసుకుంటూ వస్తున్నాడు. తాజాగా బయోమెట్రిక్ విధానంతో వేలిముద్ర వేయించుకోవాలి. పోస్టల్ కార్యాలయం చుట్టూ తిరిగినా వేలిముద్ర సరిపోవడం లేదంటూ తిరస్కరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. 13వ తేదీన గుండె ఆగి చనిపోయాడు. ఓ వైపు జన్మభూమి సభలో అధికారులు, నేతల ప్రసంగాలు. మరో వైపు దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన వృద్ధుల విలాపం. వీరి వినతులను పట్టించుకునే నాథులే కనిపించకపోవడంతో ప్రాంగణంలోనే సొమ్మసిల్లిపోతున్న పండుటాకులు. కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో ఈ నెల 4వ తేదీన జరిగిన సభలో ఎస్. నాగమ్మ (90) అనే వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయినా పట్టించుకోలేదు పాపం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు పదుల సంఖ్య దాటి బాధితుల సంఖ్య వందలు దాటుతుండడంతో పండుటాకులకు బతుకుపై భయం పట్టుకుంది. బాల్యం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలెదురైనా కలత చెందకుండా ధైర్యంగా ఎదుర్కొన్న ఆ గుండెల్లో లయతప్పుతోంది. కాటికి కాళ్లు చాపుకుని, ఏ ఆదరువు లేని సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా సాకులు చూపిస్తూ పింఛన్లు రద్దు చేయడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకున్నా కుదరదనడంతో మనస్థాపానికి గురైన వారు కొందరు, వైకల్యం ఉన్నా లేదనడంతో మనసు వికలమైన వారు మరికొందరు, వితంతువైనా కాదనడంతో కళ్లనీళ్లపర్యంతమైన వారు ఇంకొందరు ఇలా ఎందరెందరో బాధితులుగా మిగిలి పోతున్నారు. శేష జీవితంలో అష్టకష్టాలు పడలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుండడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన ప్రారంభమయింది. తన పింఛన్‌ను తొలగించారని మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కొంగపాడు గ్రామానికి చెందిన కావూరి సుబ్బులు (87) మృతి చెందిన సంగతి తెలిసిందే. నెలకు రెండు వందలు వచ్చే పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్నది ఊడదియ్యడంతో కలకలం రేగుతోంది. ‘పండుటాకులం మా పింఛన్ ఎలా తీసేయ్యాలనిపించిందయ్యా, చూపు కనపడదు, నడవలేని స్థితిలో ఉన్న మా కడుపు కొట్టారయ్యా’ అంటూ వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పరిశీలన పేరుతో అధికార పార్టీ నేతలలో నింపేసిన కమిటీలు తమకు ఓటు వేయలేదనుకున్న వారి పేర్లను అర్హత ఉన్నా నిర్దాక్షణ్యంగా తొలగించేశాయి. మరోవైపు గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సెర్ప్ అధికారులు ఆధార్‌లో లోపాలను వెతికి వ్యవసాయ భూమి ఉందన్న పేరుతో ఏకంగా 42 వేల పింఛన్లను నిలుపుదల చేశాయి. ప్రకాశం జిల్లాలో 3,12,000 పింఛన్లుండగా, గ్రామ కమిటీలు 37 వేల పింఛన్లు తొలగించాయి. మరో 42 వేల పింఛన్లు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పూర్) ఆదేశాలతో తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 79 వేల మందికి పింఛన్ ఆగిపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పింఛన్ల తనిఖీ కమిటీకి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్ కాఫీలు ఇచ్చారు. గత నెలలో జరిగిన జన్మభూమి గ్రామసభల్లో అధికారులకు తగిన ఆధారాలు అందజేశారు. అధికారులు వీరందరినీ అర్హులుగా తేల్చారు. వచ్చేనెల నుంచి పింఛన్లు వస్తాయని హామీ కూడా ఇచ్చారు. కానీ పింఛన్లు రాకపోవడంతో ఆందోళనతో ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వేలి ముద్రలు సరిపోకపోవడంతో పింఛన్లు చాలా మందికి చేతికి అందడం లేదు. వేటపాలెంలో జీడిపప్పు ఫ్యాక్టరీల్లోనూ, చేనేత పనుల్లో పనులుచేసేవారు ఉన్నారు. జీడి పప్పు ఫ్యాక్టరీల్లో పనిచేసేవారికి జీడి గింజలు పగలగొట్టే పనుల్లో కార్మికులకు చేతులకు జీడి అంటుకొని వేలిముద్రలు చెదిరిపోతాయి. వీరితో పాటు చేనేత కార్మికులు చేనేత పనులు చేసే సమయంలో వేలి ముద్రలు అరిగిపోతాయి. వీరితోపాటు రామన్నపేట పంచాయతీ పరిధిలోని లెప్రసీకాలనీ (కుష్టివ్యాధి కాలనీ)లో దాదాపు 50 కుటుంబాలు ఉంటున్నాయి. వీరికి చేతిలో కూడా వేలి ముద్రలు సక్రమంగా ఉండవు. వీరందరికి పింఛన్లు ఆగిపోయాయి. వీరితోపాటు వికలాంగులు, వితంతువులకు కూడా ఎటువంటి కారణాలు చూపకుండా పింఛన్లను తొలగించి వేయడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేను ఆస్తిపరుడినా? లింగసముద్రం: పంచాయతీలోని జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన కుమాళ్ల మాలకొండయ్యకు కుమ్మరి వృత్తి ఆధారం. ప్రస్తుతం 74 సంవత్సారాల వయసు. ఐదుగురు కుమార్తెలకు వివాహాలు అరుు్య వాళ్ల మెట్టింట్లో కాపురం చేసుకుంటున్నారు. మాలకొండయ్య తన భార్య బుజ్జమ్మ పొట్ట నింపుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆరోగ్యం సహకరించకపోరుునా ఆయన హూండీలు తయారు చేసి.. దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకుంటుంటాడు. వీరికి పింఛన్ నగదు చేదోడు వాదోడుగా ఉండేది. అరుుతే ఈ వృద్ధుడు ఆస్తిపరుడని.. సంపాదన బాగా ఉందంటూ నిలువునా పింఛనుకు కత్తెర వేశారు. ఈ పరిణామంతో దిమ్మదిరిగిపోరుున మాలకొండయ్య.. తిరిగి పింఛను మంజూరు చేయూలంటూ అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నాడు. అలాగే మేదరమిట్లపాలేనికి చెందిన సొలస ఆదేమ్మకు 85 సంవత్సారాల వయసప్పుడు పింఛను తొలగించారు. జాబితాలో 50 ఏళ్లుగా నమోదైందంటూ ఈ చర్య తీసుకున్నారు. - కుమాళ్ల మాలకొండయ్య, జంపాలవారిపాలెం (లింగసముద్రం) -
‘పది’లో సంస్కరణలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతి పరీక్షల్లో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ 2005, విద్యాహక్కుచట్టం 2009 లక్ష్యాలు సాధించేలా ఎన్సీఈఆర్టీ ప్రతిపాదించిన సంస్కరణలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. 9వ తరగతికి ప్రశ్నపత్రాలను డీఈసీబీ రూపొందిస్తుంది. పదో తరగతికి మొదటి రెండు సమ్మెటివ్ (త్రైమాసిక, అర్ధ సంవత్సర) పరీక్షలకు డీసీఈబీ ప్రశ్నపత్రాలు సరఫరా చేస్తుంది. పబ్లిక్ పరీక్షలకు మాత్రం ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు జారీ చేస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పదో తరగతి పరీక్షల్లో తెలుగు, ఇంగ్లిషు, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకు ఒకే పేపర్ ఉంటుంది. జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మేథమేటిక్స్ సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉంటాయి. సీబీఎస్ఈ పరీక్ష విధానం తరహాలో ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల మార్కులతో పాటు ఇంటర్నల్ మార్కులు కూడా కలుపుతారు. ప్రతి సబ్జెక్టుకు కేటాయించిన 100 మార్కుల్లో 80 మార్కులకు ఫైనల్ పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులకు విద్యార్థుల అంతర్గత సామర్థ్యాలను అంచనావేసి కేటాయిస్తారు. 35 మార్కులకు ఉత్తీర్ణత: ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు కనీసం 35 మార్కులు సాధిస్తేనే ఆ సబ్జెక్టులు ఉత్తీర్ణులైనట్లు. ఇప్పటి వరకు హిందీ మినహా మిగిలిన ఇంగ్లిషు, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ సబ్జక్టులకు రెండేసి పేపర్లు ఉండేవి. ఈ రెండు పేపర్లలో కలిపి కనీసం 35 మార్కులు సాధిస్తే ఆ విద్యార్థి ఉత్తీర్ణుడైనట్లే. తాజా సంస్కరణల ప్రకారం విద్యార్థులు ప్రతి పేపర్లో కనీస ఉత్తీర్ణతా మార్కులు సాధించాలి. విద్యార్థులకు నిర్వహించే ఫైనల్ పరీక్షతోపాటు ఇంటర్నల్ అసెస్మెంట్లో కూడా కనీస మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థి కనీస ఉత్తీర్ణత 35 మార్కుల్లో28 మార్కులను ఫైనల్ పరీక్షల్లో సాధించాలి. మిగిలిన 7 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్లో రావాలి. విద్యార్థులకు పరీక్ష సమయాన్ని కూడా పెంచారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు పరీక్షలు రాసేందుకు 3 గంటల సమయం కేటాయించారు. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటలు సమయం ఇచ్చారు. అన్ని పరీక్షలకు అదనంగా ప్రశ్నపత్రం చదువుకునేందుకు మరో 15 నిముషాలు కేటాయించారు. సమ్మెటివ్ అసెస్మెంట్ ఇలా.. 9, 10 తరగతుల విద్యార్థులకు 20 మార్కులకు సమ్మెటివ్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. ఈ 20 మార్కుల్లో 5 మార్కుల చొప్పున నాలుగు అంశాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులు కథల పుస్తకాలు, బాల సాిహ త్యం, వార్తా పత్రికలు చదవడం, వాటి గురించి తరగతి గదిలో చర్చించిన విషయాలకు 5 మార్కులు కేటాయిస్తారు. సైన్స్‌లో తరగతి గదిలో ప్రయోగాలు నిర్వహించడం, రికార్డు రాసినందుకు, గణితంలో తరగతి గదిలో చేసిన లెక్కలు, సోషల్ స్టడీస్‌లో సామాజిక వర్తమాన అంశాలపై తరగతి గదిలో చర్చించినందుకు 5 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులందరికీ నోట్ బుక్స్‌లో రాతపనికి 5 మార్కులు, ప్రాజెక్టు వర్కుకు 5 మార్కులు, స్లిప్ టెస్ట్‌కు 5 మార్కులు చొప్పున మొత్తం 20 మార్కులకు విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేసి కేటాయిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారిచే నియమితులైన మోడరేషన్ కమిటీ ఈ రికార్డులన్నీ పరిశీలించి మార్కులు ఇస్తుంది. ఈ మార్కులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్‌కు ఆన్లైన్లో పంపుతారు. సహ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం: పాఠశాలలో మొదటిసారిగా సహ పాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వాటికి కేటాయించిన గ్రేడ్లను కూడా విద్యార్థుల మార్కుల జాబితాలో ప్రచురించనున్నారు. ఈ సహ పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించనప్పటికీ వారి సామర్ధ్యాన్ని బట్టి విద్యార్థులకు ఏ+, ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ప్రకటిస్తారు. ప్రధానంగా విద్యార్థులకు వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలిస్తారు. పదో తరగతిలో కొత్త పాఠాలు గిద్దలూరు, న్యూస్‌లైన్: కాలానుగుణంగా విద్యా ప్రమాణాలు పెంచే క్రమంలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్‌ను పూర్తిగా మార్చేశారు. సమాజంపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలకు ప్రాధాన్యత కల్పించారు. జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన మండలి మార్పు చేసింది. ముందుగా 2012-2013 విద్యా సంవత్సరంలో ఒకటి, రెండు, మూడు, ఆరు, ఏడు తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చారు. ఈ ఏడాదిలో పదో తరగతి పాఠ్య పుస్తకాల సిలబస్‌ను మార్చారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత పదో తరగతి పాఠ్యపుస్తకాలు, పరీక్ష విధానంలో మార్పులు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈఏడాది ఏప్రిల్‌లోనే నూతన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందజేయడం శుభపరిణామం. మారిన సిలబస్‌లో కృత్యాధారిత బోధనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. విషయ అవగాహనకు ప్రాధాన్యం ఇచ్చేవిగా ఉన్నాయి. విద్యార్థులు ఆలోచించడం, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తీకరించడం, విశ్లేషణ చేసేలా, వ్యక్తిత్వాన్ని పెంచేలా పాఠ్యపుస్తకాలను రూపొందించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు, స్త్రీల సాధికారత, వారిని గౌరవించడం తదితర విషయాలకు ప్రాధాన్యం ఇచ్చేలా పాఠ్యాంశాలు పొందుపరచారు. శిక్షణ ఇచ్చేదెన్నడు...? మరో 13 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. దీనిపై విద్యాశాఖ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాత సిలబస్ చెప్పడానికి అలవాటు పడిన తమకు నూతన సిలబస్‌లో బోధన మెళకువలు, నూతన పరీక్ష విధానంపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. -
పుస్తకాల పంపిణీ ఈసారి ముందుగానే
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : విద్యాసంవత్సరం ప్రారంభమైనా పాఠ్యపుస్తకాలు అందక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అవస్థలు పడడాన్ని ఇన్నాళ్లు చూశాం. ఈసారి పరిస్థితి మారింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ డెరైక్టర్ పూనం మాలకొండయ్య పుస్తకాల పంపిణీని పకడ్బందీగా చేపట్టారు. దీంతో ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు ముందే జిల్లాకు చేరాయి. జిల్లాలో 465 ఉన్నత పాఠశాలలు, 975 ప్రాథమికోన్నత పాఠశాలు, 1,525 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికిగాను ఈ ఏడాది విద్యా సంవత్సరానికి 16.45 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 97,450 పుస్తకాలు గత సంవత్సరంవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా 15.60 లక్షల పుస్తకాలు కొత్తగా అవసరమయ్యాయి. ఇప్పటికే 15.51 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని ఆయా పాఠశాలలకు పంపించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే.. పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాల పంపిణీపై మంగళవారం తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. అన్ని తరగతుల విద్యార్థులకు అన్ని టైటిల్స్‌ను అందించాలని సూచించారు. -
రేపటి నుంచే వేసవి సెలవులు
నేడు పాఠశాలలకు చివరి పనిదినం పునః ప్రారంభం కొత్త రాష్ట్రాల్లో హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నారుు. బుధవారం పాఠశాలలకు చివరి పనిదినం. కాగా, పాఠశాలలు కొత్త రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పునఃప్రారంభం కానున్నారుు. ఇదిలాఉండగా, 7నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు విద్యాశాఖ వుుందుగానే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది. జిల్లాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి కావచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులు వేసవి సెలవుల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో ఇప్పటివరకు 70 శాతం వరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు వుుందుగానే పుస్తకాలు పంపిణీ చేయుడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.