
సాక్షి, మాచారెడ్డి: గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆయా పార్టీల కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల వాగ్దానాలు చేస్తూ తాయిలాలు వెదజల్లుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు, రైతు మధ్య జరిగిన ముచ్చట ఇది.
- ఏం మల్లయ్య మామ యాడికి పోతున్నవే అంత మందచిదేనా?
- అంత మంచిదేరా శ్రీను ఏమ్జేయమంటవురా మీ అయ్య లెక్క నాకేమన్న నౌకరి ఉందారా? ఏదో బత్కుదెరువ కోసం ఇంత కైకిలో గంబడో జేస్కోవాలే. గా రామన్న వడ్ల సంచులు మోసేందుకు రమ్మంటే పోతున్న బిడ్డా
- అరే నీ పని పాడ్గాను. గీ వయసులో సుత కైకిల్ జేస్తావే.
- కైకిల్ జేయకుంటే గీ జానెడు కడుపులకు ఓళ్లు వెడ్తర్రా శ్రీను. ఇద్దరు కొడుకులున్నా లేని కిందికే. నీకు దెల్వదు వాళ్ల ఎవనంతల ఆడే ఉండవట్టిరి. ఇగ మీ అత్తకు పచ్చవాతమచ్చి ఏడేండ్లయే. పదేండ్ల సంది దాన్ని కూసుండే బెట్టి సాదవడ్తి. ఇద్దరు కొడుకులున్నా ఎవడేం పెడుతున్రు బిడ్డ. అది నీకు దెల్సిన సంగతేనాయే
- అరే మామ నీకు కట్టమే ఉందే నిజ్జంగా నీది బట్టు(బష్టు) రాతనేనే.
- ఇగ నీఅసోంటోళ్లకు దెలిస్తే సాలు బిడ్డా. ఇగవోత బిడ్డ టైమైతుంది.
- అవేగని మల్లయ్య మామ. మరి ఎలచ్చన్లు అస్తున్నై కదా, ఓట్లు ఓళ్లకేద్దామనుకుంటుండ్రే.
- ఏమో బిడ్డా మొన్న గాళ్లచ్చి ఓటుకు వేయి రూపాయలు, ఒక కోటరు సీసా ఇస్తమన్నరు. బిడ్డా మరి ఓటు ఓళ్లకేస్తే మంచిగుంటదంటవ్. ఇదిట్లుంటే ఇగ మనూళ్లే పెద్ద మనుషులు ఓళ్లకు ఒక్క మాటిస్తలేరు
- గట్లెందుకు మామ ఓళ్లకో ఒకళ్లకు ఓటు వేయాలేగదా, గట్లెందుకు నానవెడ్తుండ్రే.
- ఇంకా కొద్ది రోజులాగితే ఇంకా ఎక్వ పైసల్తిరని గా పెద్ద మనుషులు నాన వెడ్తుండ్రు బిడ్డా. మరి నీకు దెల్సిన వాళ్లు ఓళ్లయినా ఉన్నర్రా శ్రీను
- ఏ... నీ యవ్వ నాకోల్లు దెల్చే మామ ఓళ్లు దెల్వదు
- ఏ... కాదు బిడ్డ నువ్వు సదువు శాత్రం దెల్సినోనివి గదా. నీకు నాలుగు ముచ్చట్లు దెలుస్తుయని అడుగుతున్న బిడ్డా, ఏమనికోకు.
- ఏ తియ్యి మామ నేనేమనుకుంటనే ఏమనుకోను. అది కాదు, మామ ఓటును అమ్ముకోవద్దు. ఇయ్యాళ్ల ఆళ్లు వెయ్యో, రెండు వేలో ఇస్తే మనం ఓటేస్తమనుకో, రేపు ఆళ్లు గెల్సినాంక ఏదన్న పనిమీద మనం బోతే మనల్ని కాన్తరానే. మీరు ఓట్లు పుక్కడికి ఏసిండ్రా పైసలిస్తేనే ఏసిండ్రు. ఇప్పుడు మీకు గా పని కావాలంటే లంచమడుగుతరు. గప్పుడు ఏమ్జేస్తవే చెప్పు మామ.
- టమరెట్లరా శ్రీను ఉత్తపున్నానికి ఓట్లేయమంటవారా. మీ అయ్యవోను.
- అవును మామ గిప్పుడు మనం అభిమానంతో నియ్యత్ దప్పకుండా ఓట్లేస్తే ఆళ్లు రేపు మనకు సేవజేస్తరు. అందుకే మా అయ్యకు చెప్పినా, ఓటును అమ్ముకోవద్దని. నీకు చెప్తున్నా
- సరే బిడ్డా శ్రీను నువ్వెట్ల చెప్తే గట్ల. ఇగ పోయాస్త బిడ్డ మరి.
Comments
Please login to add a commentAdd a comment