మాట్లాడుతున్న బీవీ రాఘవులు
సాక్షి, నిజామాబాద్‌నాగారం: సామాజిక తెలంగాణ సాధన కోసం ఏర్పడిన బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పోలీటీబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని ఓడించాలని కోరారు. మంగళవారం బీఎల్‌ఎఫ్, సీపీఎం, ఎంబీటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మూన్నూరుకాపు కల్యాణమండపంలో నిర్వహిం చిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశాయన్నారు. జిల్లాకు కొత్తగా పరిశ్రములు తీసుకరాకపోగా ఉన్న పరిశ్రమలను మూసేసి, యు వతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేశారని విమర్శించారు.
షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి కార్మికులను రోడ్డున పడేశారని, పసుపుశుద్ధి కర్మాగారం కలగానే మిగిలి పోయిందన్నారు. అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టి సామాజిక న్యా యాన్ని, సమగ్రాభివృద్ధిని కాంక్షించే బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్, ఎస్.రమ, సీపీఎం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌బాబు, ఆర్‌పీఎస్ జిల్లా కార్యదర్శి సాయిబాబా, సీపీఐ జిల్లా కార్యదర్శి మార్టిన్‌రాజు, టీమాస్ కన్వీనర్ పెద్ది వెంకట్రాములు, బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు ఇస్మాయిల్, నూర్జహాన్, మధుకర్, నేతలు మాల్యల గోవర్ధన్, వెంకటేశ్, లత పాల్గొన్నారు.
కోట్లు పెట్టి ఓట్లు కొంటున్నారు
బోధన్: ప్రజా సంపదను లూటీ చేసే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. ఆయా పార్టీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేస్తున్నాయని, వారికి అధికార దాహం తప్ప ప్రజల కష్టా లు పట్టవని విమర్శించారు. మంగళవారం బోధన్‌లోని ఉర్దూఘర్ సమీపంలోని బీఎల్‌ఎఫ్ బోధన్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్ నాయక్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజాధనానికి నష్టం కలిగించారని విమర్శించారు. గతంలో ముందస్తు ఎన్నిలకు వెళ్లి పార్టీలు ఓడిపోయాయని రాఘవులు గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనం, పునరుద్ధరణ విషయంలో టీఆర్‌ఎస్ మౌనం వహించిందన్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన సామాన్యులనే నిలబెట్టామన్నారు. నేతలు పాలడుగు భాస్కర్, వనం సుధాకర్, రమా, సాయిబాబా, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment