BV raghuvulu
-
ఆ పార్టీలను ఓడించండి: బీవీ రాఘవులు
సాక్షి, నిజామాబాద్‌నాగారం: సామాజిక తెలంగాణ సాధన కోసం ఏర్పడిన బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పోలీటీబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని ఓడించాలని కోరారు. మంగళవారం బీఎల్ఎఫ్, సీపీఎం, ఎంబీటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మూన్నూరుకాపు కల్యాణమండపంలో నిర్వహిం చిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశాయన్నారు. జిల్లాకు కొత్తగా పరిశ్రములు తీసుకరాకపోగా ఉన్న పరిశ్రమలను మూసేసి, యు వతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి కార్మికులను రోడ్డున పడేశారని, పసుపుశుద్ధి కర్మాగారం కలగానే మిగిలి పోయిందన్నారు. అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టి సామాజిక న్యా యాన్ని, సమగ్రాభివృద్ధిని కాంక్షించే బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్, ఎస్.రమ, సీపీఎం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌బాబు, ఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సాయిబాబా, సీపీఐ జిల్లా కార్యదర్శి మార్టిన్‌రాజు, టీమాస్ కన్వీనర్ పెద్ది వెంకట్రాములు, బీఎల్ఎఫ్ అభ్యర్థులు ఇస్మాయిల్, నూర్జహాన్, మధుకర్, నేతలు మాల్యల గోవర్ధన్, వెంకటేశ్, లత పాల్గొన్నారు. కోట్లు పెట్టి ఓట్లు కొంటున్నారు బోధన్: ప్రజా సంపదను లూటీ చేసే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. ఆయా పార్టీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేస్తున్నాయని, వారికి అధికార దాహం తప్ప ప్రజల కష్టా లు పట్టవని విమర్శించారు. మంగళవారం బోధన్‌లోని ఉర్దూఘర్ సమీపంలోని బీఎల్ఎఫ్ బోధన్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్ నాయక్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజాధనానికి నష్టం కలిగించారని విమర్శించారు. గతంలో ముందస్తు ఎన్నిలకు వెళ్లి పార్టీలు ఓడిపోయాయని రాఘవులు గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనం, పునరుద్ధరణ విషయంలో టీఆర్ఎస్ మౌనం వహించిందన్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన సామాన్యులనే నిలబెట్టామన్నారు. నేతలు పాలడుగు భాస్కర్, వనం సుధాకర్, రమా, సాయిబాబా, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామిక విలువల కోసం పోరాడాలి
మంచాల: ప్రజాస్వామిక విలువల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. రంగా రెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్లలో శని వారం ఆ పార్టీ జాతీయ మహాసభల ప్రచార బస్సు యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన పాలక వర్గాలు ఆయా వర్గాలపై నిరంకుశ ధోరణిని అవలంబించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ బాటలోనే నడుస్తోందన్నారు. సామాజిక న్యాయంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాఘవులు అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జాతీయ నాయకుడు అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చుక్కా రాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కిల్ల గోపాల్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి పాల్గొన్నారు. -
'ఏపీ ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు ఏకం కావాలి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాతపాటే పాడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విభజన జరిగేటప్పుడు మాట ఇచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తప్పుతున్నారని చెప్పారు. -
రుణాలన్నీ మాఫీ చేస్తారా.. లేదా?
సీఎం చంద్రబాబుకు సీపీఎం నేత బి.వి. రాఘవులు సూటి ప్రశ్న పాలకొల్లు: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిస్థారుులో మాఫీ చేస్తారో లేదోనన్న విషయూన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే తేల్చిచెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై చంద్రబాబు చేసిన తాజా ప్రకటన రైతులు, డ్వాక్రా మహిళలను అయోమయంలోకి నెట్టేసిందన్నారు. చంద్రబాబు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. సార్వా సీజన్ ప్రారంభమై పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న రైతులు.. రుణాలు మాఫీ అవుతాయో లేదో, రీ షెడ్యూల్ అరుునా చేస్తారో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కౌలు రైతులకూ రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రీయింబర్స్మెంట్ సంగతేంటి? హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ విషయం ఎటూ తేలకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని సూచించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా కేంద్రం జోక్యం కోసం ముఖ్యమంత్రి పడిగాపులు పడడం అవివేకమన్నారు. మద్యం వ్యాపారానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి సంబంధాలున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే చంద్రబాబు అధికారం చేపట్టి మద్యం వ్యాపారానికి తెరలేపారని చెప్పారు. బెల్ట్‌షాపులు నిరోధిస్తామని, ఇందుకోసం గ్రామస్థాయిలో కమిటీలు వేస్తామని ప్రభుత్వం చెప్పడం దళారులను పెంచిపోషించడానికేనని విమర్శించారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరిందని, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. నిరుద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు -
అది కాలకూట విషపు జట్టు
మోడీ, బాబు, పవన్‌లపై రాఘవులు ధ్వజం అనంతపురం /కడప, నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ జట్టు అభివృద్ధి కోసం ఏర్పడినది కాదని, అది ఒక కాషాయ కాలకూట విషం వెదజల్లే జట్టని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభివర్ణించారు. బీజేపీ మతతత్వ విధానాలు దేశ సమగ్రతకే ప్రమాదమని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకొని రాష్ట్ర విభజనకు సహ కరించి తెలుగు పదానికి చంద్రబాబు అపచారం చేశాడని విమర్శించారు. శుక్రవారం అనంతపురంలో విలేకరులతో, కడపలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడి ప్రధాని అయితే గుజరాత్ తరహా కార్పొరేట్ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసే ప్రమాదముందన్నారు. ఆయన ప్రధాని కావడం చారిత్రక అవసరం కాదని, చారిత్రక అపచారం అవుతుందని హెచ్చరించారు. వీరు అధికారంలోకొస్తే ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తారని, తద్వారా సామాజిక న్యాయం జరగదని వివరించారు. పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడో.. పెట్టలేదో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఈయన ఐదు నిమిషాలకే పార్టీ మార్చే రకం అని ఎద్దేవా చేశారు. అతడిని చూస్తే జాలేస్తుందన్నారు. రాష్ట్ర విభజన పాపం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లదేనని అన్నారు. -
జేబు నింపుకొంటున్న సీఎం: బీవీ రాఘవులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఉపయోగపడే ఫైళ్లపై సంతకాలు చేయడం మానేసి తన జేబు లు నింపుకొనేందుకు సొంత సంతకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శిం చారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాఘవులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. గత 15 రోజులుగా సీఎం సొంత సంతకాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. సీఎం పదవిలో ఉంటారో లేదో తెలియని మీరు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తే వారికి గుర్తుండిపోతారని కిరణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళల సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్వాడీల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. అంగన్వాడీల్లో ఐకేపీ జోక్యాన్ని నివారించాలని, పెండింగ్ బిల్లులు, పెంచిన అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక దీక్షలో సాయిబాబా (సీఐటీయూ), చంద్రశేఖర్ (ఐఎన్టీయూసీ), రాంబాబు (టీఎన్టీయూసీ), నరసింహ (ఏఐటీయూసీ), పోటు ప్రసాద్ (ఐఎఫ్టీయూ), ఆలిండియా బీమా ఉద్యోగుల సంఘం కర్ణాటక, ఏపీ జోనల్ కార్యదర్శి క్లెమెంట్ దాస్, మహిళా విభాగం కన్వీనర్ అరుణకుమారి, ఆశా వర్కర్స్ నేత హేమలత, లోక్‌సత్తా నేత భవానీ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాలు బలంగా ఉంటేనే ‘సమాఖ్య’ పటిష్టం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలు బలంగా ఉంటేనే సమాఖ్య వ్యవస్థ బలపడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు సోమవారం సీపీఎం కార్యాలయంలో రాఘవుల్ని కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రెడ్డి, నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల మాజీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, ఎస్కే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ముత్యాల నాయుడు, ప్రముఖ న్యాయవాది వి.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, సమైక్యత కోసం రాష్ట్ర పరిరక్షణ వేదిక చేస్తున్న కృషికి మద్దతు పలికారు. వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతపై సీపీఎం, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, బొత్స సత్యనారాయణ సానుకూలత ప్రకటించారని చెప్పారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియను ప్రారంభించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇదే విషయాన్ని రాఘవులుకు వివరించామని తెలిపారు. త్వరలో టీడీపీ, లోక్‌సత్తా నేతల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ను కలిసి తమ ఉద్యమానికి మద్దతు ఇమ్మని కోరనున్నట్టు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు కేంద్రం బలంగా ఉండాలని, రాష్ట్రాలు చిన్నవిగా బలహీనంగా ఉండాలని కోరుకుంటున్నాయని, ఈ వైఖరిని ఖండించాలని ప్రజాస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రులు ఇప్పటికైనా తమ మంత్రిపదవులకు రాజీనామాలు ఇచ్చి సమైక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సభకు అనుమతి ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, అందుకు వైఎస్సార్సీపీ కూడా మినహాయింపు కాదని రాఘవులు చెప్పారు. వైఎస్సార్సీపీ ఈనెల 19న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఏపీఎన్జీవోలు, కాంగ్రెస్, బీజేపీ, టీజేఏసీ సభలకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ సభకూ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఇంతకుమించి వ్యాఖ్యనించలేనని చెప్పారు.