కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాతపాటే పాడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విభజన జరిగేటప్పుడు మాట ఇచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తప్పుతున్నారని చెప్పారు.