ఖమ్మం జెడ్పీసెంటర్:వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ హెచ్చరించారు. పెండింగ్ కేసుల్లో కౌంటర్ దాఖలు చేసి సత్వర పరిష్కారానికి కృషిచేయాలని చెప్పారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు జేసీ బాబూరావుతో కలిసి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1063 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి కౌంటర్ పిల్ దాఖలు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏజేసీకి సూచించారు. ఎవరైనా అధికారులు స్పందించకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గ్రీవెన్స్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మండలస్థాయిలో జరిగే గ్రీవెన్స్‌కు అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు. మైనార్టీల స్థితిగతులను, పింఛన్లు అందుతున్న తీరును తెలుసుకోవాలని మెనార్టీ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
గ్రీవెన్స్‌లో వచ్చిన సమస్యల్లో కొన్ని
కంటి చూపు సరిగ్గా లేకపోవడంతో ఆధార్ కార్డు రావడం లేదని, ఆధార్ లేదని పింఛను ఇవ్వడం లేదని, తనకు పింఛను ఇప్పించాలని కూసుమంచి మండలం గైగోళ్ళపల్లికి చెందిన కదరమ్మ అనే వృద్ధురాలు వేడుకోగా.. పింఛను మంజూరు చేయూలని డీఆర్‌డీఏ పీడీని జేసీ ఆదేశించారు.
తిరుమలాయపాలెం మండలంకేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో మృతి చెందిన బాణోత్ శిల్ప కుటుంబాన్ని ఆదుకోవాలని ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు లక్ష్మణ్, బాణోత్ భద్రునాయక్ కోరారు.
పాల్వంచకు చెందిన యడ్లపల్లి ఉపేందర్‌రావు తమకు చెందిన భూమి కేటీపీఎస్ నిర్మాణం కోసం తీసుకున్నారని ల్యాండ్ లూజర్ కింద తన సోదరుడికి ఉద్యోగం ఇచ్చారని, అప్పటి ఒప్పందం ప్రకారం తనకు ఇస్తానన్న ల్యాండ్ ఇవ్వడంలేదని జేసీకి ఫిర్యాదు చేశారు.
దళితుల భూ పంపిణీకి తాము భూములు విక్రరుుస్తామని, వాల్యుషన్ వేసి ధర నిర్ణయించాలని మధిరకు చెందిన రైతులు విన్నవించారు.
కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
Published Tue, Nov 18 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement