డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు స్థలాలు చూడండి
రెవెన్యూ అధికారుల సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 500 ఎకరాల ప్రభుత్వస్థలాల్ని వెంటనే గుర్తించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రెవె న్యూ అధికారులను కోరారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే గుర్తించిన 20 ప్రాంతాల్లో రెండు ప్రాంతాలు మాత్రమే జీహెచ్‌ఎంసీకి అప్పగించారని, ఎలాంటి వివాదాలు లేని మరో 11 ప్రాంతాలను వెంటనే జీహెచ్‌ఎంసీకి బదలాయించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. ఇళ్లనిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై శనివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆర్డీఓలు, తహశీల్దార్లతో జీహెచ్‌ఎంసీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూముల్ని త్వరితగతిన సేకరించి జీహెచ్‌ఎంసీకీ అప్పగించాలని కోరారు.
నగరంలో 1466 నోటిఫైడ్ స్లమ్స్ ఉండగా, దాదాపు రెండు లక్షల మందికి ఇళ్లులేవని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలి పారు. జీహెచ్‌ఎంసీతో పాటు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. నగరంలో నైట్‌షెల్టర్లు, పార్కులు, చెత్త రవాణా కేంద్రాలు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి కూడా భూముల్ని గుర్తించాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయాల వారీ గా తహశీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌వోలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. సోమవారం రాజేంద్రనగర్, మంగళవారం సరూర్‌నగర్, శుక్రవారం మల్కాజిగిరి ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహిం చే ఈసమావేశాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు హాజరు కావాలని కోరారు. సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం, హైదరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశా లు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషన ర్లు సురేంద్రమోహన్, శివకుమార్‌నాయుడు, భాస్కరాచారి పాల్గొన్నారు.