అక్బర్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు జిల్లా లో ఊపందుకుంటున్నాయి. ఫిబ్రవరిలో వర్ని మండలం అక్బర్‌నగర్‌లో నిర్మించిన 40 జీ+1 భవనాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మం త్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. కొంత మంది లబ్ధిదారులకు ఇళ్లను కూడా కేటాయించారు. దీంతో వర్ని మండలం అక్బర్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు పొందిన మేదరి సాయ మ్మ, గైని అనురాధ హర్షం వ్యక్తం చేశారు. తెలిపారు. మరో 40 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో 112 లొకేషన్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించారు. నిజామా బాద్ అర్బన్ నియోజకవర్గంలో నాగా రంలో నిర్మిస్తున్న ఇళ్లు చివరి దశకు చేరాయి. రూరల్ నియోజకవర్గంలోని బీబీపూర్ తండాలో కూడా దాదాపు 50 వరకు భవనాలను నిర్మిస్తున్నారు. ఇవి చివరి దశకొచ్చాయి. ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచడానికి కలెక్టర్ రామ్మోహన్‌రావు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment