సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏటా ఇచ్చే అవార్డుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాల జీ (సీసీఎంబీ) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి ఎంపికయ్యారు. అవార్డు కింద బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. బ్యాక్టీరియా కణం గోడలను, నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఆమె పలు పరిశోధనలు చేశారు. తద్వా రా కొత్త కొత్త యాంటీబయాటిక్ మందు ల తయారీకి మార్గం సులువైందని అంచ నా. జీవ రసాయన, జన్యుశాస్త్రాల ఆధారంగా కొన్ని ఎంజైమ్‌ల సాయంతో కణం గోడలు ఎలా రెండుగా విడిపోతాయో డాక్టర్ మంజులా రెడ్డి గుర్తించారు. జీవశాస్త్రాలతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సెస్, హ్యుమానిటీస్, గణిత, భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను ఇన్ఫోసిస్ ఏటా అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment