Manjula Reddy
-
TS Election 2023: మహిళా రిజర్వేషన్లు అమలుతో.. తెరపైకి ఏనుగు మంజులారెడ్డి!
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి మంజులారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్నికల వ్యవహారాలతో పాటు క్యాడర్ బాధ్యతను ఆయన సతీమణి మంజులారెడ్డే చూసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించిన మంజులారెడ్డికి రాజకీయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. భర్త రవీందర్‌రెడ్డితో కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చారు. 2004 లో టీఆర్ఎస్ టికెట్‌ను మొదట మంజులారెడ్డికే కేటాయించాలని భావించారు. అయితే ఆమె స్థానంలో రవీందర్‌రెడ్డికి ఇచ్చారు. రవీందర్‌రెడ్డి గెలుపు కోసం మంజులారెడ్డి ఎంతో శ్రమించారు. ఎన్నికల సమయంలో ఆమె నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రచారం చేశారు. తాడ్వాయి మండలంలో అయితే ప్రతి ఇల్లూ ఆమెకు పరిచయమే.. 2018 ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి అనూహ్యంగా ఓటమి చెందారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ఆమె అనుచరులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్ బీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో రెండు గ్రూపులయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సురేందర్‌రెడ్డికి పా ర్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడం, రవీందర్‌రెడ్డికి నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని భావించారు. కానీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీలో అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది. బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి అసంతృప్తులను చేరదీసి పదవులు కట్టబెట్టడంతో కొంత వెనక్కి తగ్గారు. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో తనకు బదులుగా తన భార్య మంజులారెడ్డిని బరిలో నిలిపేందుకు రవీందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. రవీందర్‌రెడ్డి అనుచరులు సైతం గట్టి నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండడంతో ఎల్లారెడ్డి రాజకీయాల్లో కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన భార్యకు బీజేపీ టికెట్టుకోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. -
విజయ ‘గీత’: కసితో చదివారు.. ఆమె పేరు చివర ఆరు డిగ్రీలు
అవార్డులు ఊరికే రావు. ఆ అవార్డు వెనుక... అవార్డు అందుకున్న చేతులు చక్కబెట్టిన బాధ్యతలుంటాయి. ఆ చేతులు తీర్చిదిద్దిన జీవితాలుంటాయి. ఆ చేతులు చేతల్లో చూపించిన విజయాలుంటాయి. ‘బెస్ట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ మెంటారింగ్ స్టార్ట్ అప్స్’ అవార్డు అందుకున్న డాక్టర్ గీత ప్రస్థానమూ అలాంటిదే. జీవితంలో ఊహించని అవరోధం ఎదురు కానంత వరకు ఎవరూ జీవితాన్ని తరచి చూసుకోరు. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన జీవితం... అంటారు యష్మిసొల్యూషన్స్ సీఈవో డాక్టర్ బి. గీతారెడ్డి. యువ పరిశ్రమ యువత పట్టాలు పుచ్చుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడమే మనకు తెలిసిన పురోగతి. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగం ఇచ్చేలా ఎదగడం యువత లక్ష్యం అయి ఉండాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో మా ‘సిఐఎమ్ఎస్ఎమ్ఈ’ ఒప్పందం కుదుర్చుకుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఇందులో ఉద్దేశం. పరిశ్రమల రంగం యువకులతో, మహిళలతో నిండిపోవాలనేది నా కల. – డాక్టర్ బి. గీతారెడ్డి, చైర్పర్సన్, సిఐఎమ్ఎస్ఎమ్ఈ (ఏపీ స్టేట్). క్లస్టర్ డైరెక్టర్ (ఏపీ, ఒడిషా), కోవె ఎగ్జిక్యూటివ్ మెంబర్ యష్మి సొల్యూషన్స్ స్థాపించి సర్వీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి ముందు ఆమె తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను మనోధైర్యంతో అధిగమించారు. ప్రభుత్వ భూముల కబ్జా వంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో మొండిధైర్యంతో సాగిపోయారు. కసితో చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడామె పేరు చివర ఆరు డిగ్రీలు కనిపిస్తాయి. అందరమ్మాయిల్లాగానే నేనూ వైజాగ్‌లో పుట్టి పెరిగిన గీత ఎంసీఎ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ‘‘పెళ్లి తర్వాత కూడా చదవడమే పనిగా చదివాను. ‘ఒక సమస్య మీద గట్టిగా వాదిస్తావు. పెద్ద పోరాటమే చేస్తావు, నీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే పది మందికి ఉపయోగపడతావని చెప్పాడు మా పెద్ద తమ్ముడు. ఆ మాటతో ఎల్ఎల్బీ చేశాను. ఎంబీఏ, ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ, ఉమెన్ ఇన్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశాను. ఇదే సమయంలో నాకంటూ ఒక మంచి యాక్టివిటీని అభివృద్ధి చేసుకున్నాను. అప్పుడప్పుడే డిజిటల్ మీడియా ఊపందుకుంటున్న రోజులవి. మా చిన్న తమ్ముడితో కలిసి డిజిటల్ మీడియా సెక్టార్లో సర్వీస్ మొదలు పెట్టాను. తర్వాత 2015లో సొంతంగా సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించుకున్నాను. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు పని చేశాను. ఇప్పుడు నా సర్వీస్ బిజినెస్ చూసుకుంటూనే సమాజానికి నా వంతుగా సేవ చేస్తున్నాను. బాధితులు మహిళలే కుటుంబ సమస్యగా కనిపించే అనేక సమస్యలకు నేరుగా బాధితులయ్యేది మహిళలే. ఆ సమస్యను పరిష్కరించగలిగితే పూర్తి కుటుంబం సంతోషంగా సాగిపోతుందని నా గట్టి నమ్మకం. అందుకే మహిళల సమస్యల మీదనే దృష్టి పెట్టాను. లీగల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మహిళల స్వయంసమృద్ధి కోసం స్టార్టప్ మెంటార్‌గా కూడా మారాను. ఆర్థిక స్వేచ్ఛ కొరవడడం పరోక్షంగా మానసిక అభద్రతకు కారణమవుతుంటుంది. అక్కడి నుంచి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి, అవి న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వందలాది మంది మహిళల మనసులను చదివాను. ఆ అనుభవంతో చెప్తున్న మాట ఇది. ‘జాతకాలు చూసి మరీ పెళ్లి చేశారు మా వాళ్లు. అయినా నా జీవితం ఇలా ఉంది’ అని చాలా మంది మహిళలు బాధపడేవాళ్లు. జ్యోతిషం నిజమే అయితే ఫలితాలు ఇలా ఎందుకుంటాయనే సందేహం నాకూ కలిగింది. అప్పుడు జ్యోతిషం చదివాను. ఏ సబ్జెక్టు మీదకు దృష్టి మళ్లితే ఆ కోర్సు చేయడమే ఇప్పటి వరకు నా ప్రస్థానంగా మారింది. ఇప్పుడు బెంగళూరు ఐఐఎమ్ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది కోరిక’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి. – వాకా మంజులారెడ్డి ‘వనిత’ల కోసం మన మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ డిజైన్ చేస్తే విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హస్తకళాకృతులను, ఇతర ఉత్పత్తులతో ఉపాధి పొందే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకురావడానికి ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ ద్వారా ప్రయత్నిస్తున్నాం. గాజులు, మగ్గం వర్క్, పోటరీ, జీడిపప్పు గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ వంటి ఉత్పత్తుల మార్కెట్ కోసం ‘వనిత’ పేరుతో వెబ్సైట్ రూపకల్పన జరుగుతోంది. గార్మెంట్ మేకింగ్‌లో ఉన్న మహిళలకు హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగులకు అవసరమైన బాయిలర్ సూట్స్ ఆర్డర్ ఇప్పించడం, తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాల సమన్వయం జరుగుతోంది. -
డాక్టర్ మంజులా రెడ్డికి ఇన్ఫోసిస్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏటా ఇచ్చే అవార్డుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాల జీ (సీసీఎంబీ) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి ఎంపికయ్యారు. అవార్డు కింద బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. బ్యాక్టీరియా కణం గోడలను, నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఆమె పలు పరిశోధనలు చేశారు. తద్వా రా కొత్త కొత్త యాంటీబయాటిక్ మందు ల తయారీకి మార్గం సులువైందని అంచ నా. జీవ రసాయన, జన్యుశాస్త్రాల ఆధారంగా కొన్ని ఎంజైమ్‌ల సాయంతో కణం గోడలు ఎలా రెండుగా విడిపోతాయో డాక్టర్ మంజులా రెడ్డి గుర్తించారు. జీవశాస్త్రాలతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సెస్, హ్యుమానిటీస్, గణిత, భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను ఇన్ఫోసిస్ ఏటా అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. -
యానల్ ఫిషర్ చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ!
చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ... వ్యక్తం చేయాలంటే సిగ్గు, బిడియం, మొహమాటం.చూపించుకోవాలంటే ఇబ్బంది. ఈ మాటలకు నిజమైన నిర్వచనం... యానల్ ఫిషర్. మల విసర్జన ద్వారం వద్ద ఏర్పడే తిన్నటి పగులును ‘యానల్ ఫిషర్ లేదా ఫిషర్ ఇన్ ఏనో’ అంటారు. ప్రతి 350 మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి సాధారణంగా స్త్రీ, పురుషులిరువురిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా 15 నుంచి 40 ఏళ్ల వారిలో ఎక్కువగా వస్తుంటుంది. విపరీతమైన నొప్పితో బాధిస్తూ, తొలిదశలో చికిత్స తీసుకోకపోతే మరింత లోపలికి చీరుకుపోయి వేధిస్తూ ఉండే ‘యానల్ ఫిషర్’ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. యానల్ ఫిషర్ అంటే... మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది. ఫిషర్‌లలో రకాలు... ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించే క్రానిక్ ఫిషర్. ఆక్యూట్ ఫిషర్ : ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకుపోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూపొందవచ్చు. క్రానిక్ ఫిషర్ : ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగే క్రానిక్ ఫిషర్ నిర్దిష్టమైన లక్షణాలను కనబరుస్తుంది. ఉదాహరణకు మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుగా ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఫిషర్ రాకుండా నివారణ ఇలా... ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే... * మనం తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండాలి. * మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్ల మోతాదును గణనీయంగా తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఫిషర్‌ను సమర్థంగా నివారించుకోవచ్చు. * మాటిమాటికీ నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. * మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటిని ఉపయోగించడం మేలు. * ఒకవేళ అప్పటికే చిన్నపాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్మెంట్స్ వాడాలి. చికిత్స ఆక్యూట్ ఫిషర్‌ను కనుగొన్నప్పుడు చేసే చికిత్సలో నేరుగా ఫిషర్‌కు చికిత్స చేయడం కాకుండా... దాదాపు 80 శాతం పైగా సందర్భాల్లో ఫిషర్ ఏర్పడటానికి కారణమైన అంశాలను నివారించడానికి చికిత్స చేస్తుండటం సాధారణంగా జరుగుతుంటుంది. ఇందులో భాగంగా మలబద్దకాన్ని నివారించే మందులు ఇవ్వడం, మలాన్ని మృదువుగా మార్చే ఔషధాలు వాడటం, మలవిసర్జన సమయంలో కలిగే నొప్పిని నివారించే మందులు ఇవ్వడం వంటివి చేస్తారు. మలవిసర్జన సాఫీగా జరిగేలా పేగు కదలికలు (బవెల్ మూవ్మెంట్స్) క్రమబద్ధంగా జరిగేలా చూస్తారు. ఇక మొదటిదశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్)గా మలం మృదువుగా మారేలా స్టూల్‌సాఫ్టెనర్స్ ఇస్తారు. మలవిసర్జన తర్వాత తగినంత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించి, అక్కడ నొప్పిని తగ్గించడం, స్ఫింక్టర్ గట్టిగా బిగుసుకుపోవడాన్ని (స్ఫింక్టర్ స్పాజమ్) నిరోధించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా ఫిషర్‌కు మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్)ను నిర్లక్ష్యం చేస్తే సాధారణంగా 30% నుంచి 70% కేసుల్లో అది మళ్లీ తిరగబెడుతుంటుంది. కేవలం పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి తిరగబెట్టడాన్ని 15% నుంచి 20%కి తగ్గించవచ్చు. ఇక రెండోదశ చికిత్సగా (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) మలద్వారం లోపలికి 0.4% నైట్రోగ్లిజరిన్ వంటి మందులతో పాటు గ్లిజెరాల్ ట్రైనైట్రేట్ ఆయింట్మెంట్ వంటివి స్ఫింక్టర్ లోపల పూతమందుగా వాడాల్సి ఉంటుంది. నిఫైడిపైన్ ఆయింట్మెంట్, డిల్షియాజెమ్ ఆయింట్మెంట్ వంటి పూతమందులు కూడా బాగా పనిచేస్తాయి. శస్త్రచికిత్స ప్రక్రియలు ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి... స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి. ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. లక్షణాలు మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి ఆ తర్వాత కొద్ది గంటల సేపు బాధిస్తుంటుంది. మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ నొప్పి తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే రోగి తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటాడు. మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతుంటాడు. ఫలితంగా మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన మరింత బాధాకరంగా పరిణమిస్తుంది. చాలా మంది రోగుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో రక్తం చేతికి లేదా టాయిలెట్ పేపర్‌కు అంటడం జరుగుతుంది. అయితే ఫిషర్ విషయంలో ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడిన స్రావాలూ కనిపించవచ్చు. కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమూ కష్టం కావచ్చు. నిర్ధారణ రోగితో మాట్లాడి అతడి వ్యాధి చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం, మలవిసర్జన ద్వారం ప్రాంతాన్ని జాగ్రత్తగానూ, సున్నితంగానూ పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి పరీక్ష చేయడానికి రోగిని ఆ ప్రాంతంలో చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని స్థానిక మత్తుమందు (టాపికల్ అనస్థీషియా)చ్చి పరిశీలించడం అవసరం కావచ్చు. ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో... ఆ ప్రాంతంలో గొట్టంతో పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. సాధారణంగా రోగి 50 ఏళ్లలోపు వారైతే, ఈ తరహా పరీక్ష అవసరమవుతుంది. ఇక కొందరిలో 50 ఏళ్లు దాటాక మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారిలో పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ పరీక్షను సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ నేరుగా కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించే తీరును బట్టి పై పరీక్షలను చేయాల్సి ఉంటుంది. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకుపోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు యానోరెక్టల్ మ్యానోమెట్రీ అనే పరీక్షనూ నిర్వహించవచ్చు. కారణాలు నిజానికి ఇలా మలద్వారం చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి ఇతమిత్థమైన కారణాలు ఇంకా తెలియదు. కానీ మలవిసర్జన సమయంలో చీలికను ఒరుసుకుంటూ మలం బయటికి రావడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల దీని ఉనికి తెలుస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజాపండ్ల వంటి పీచును కలిగి ఉండే పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది. కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద ఉండే కండరాలు గట్టిగానూ, మందంగానూ మారడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగక బలంగా ఒరుసుకుపోతూ జరుగుతుంది. దీనివల్ల అక్కడ చీలిక ఏర్పడటం, చిరిగినట్లు కావడం వల్ల కూడా ఫిషర్ రావచ్చు. కొంతమందిలో మలబద్దకం వల్ల ముక్కి ముక్కి మల విసర్జన చేయాల్సి వస్తుంటుంది. మలం చాలా గట్టిగా మారడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా మలం గట్టిగా ఉండటం కారణంగా మల విసర్జన సమయంలో ఆ ప్రాంతం చీరుకుపోవచ్చు. ఇక మరికొందరిలో దీర్ఘకాలం పాటు నీళ్లవిరేచనాలు అవుతుండటం వల్ల... దీర్ఘకాలం ఆ ప్రాంతం తడిగానూ, తేమగానూ ఉండటం వల్ల కూడా ఆ ప్రాంతానికి రక్తసరఫరా తగ్గి ఫిషర్ ఏర్పడవచ్చు. మల విసర్జన తర్వాత ఇక అక్కడి నుంచి మలం లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు ఉంటాయి. అందువల్లనే మనకు మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకొక సారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగితే స్ఫింక్టర్‌కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలాంటిది జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంటుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. * కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక టీబీ, ల్యూకేమియా, క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి జబ్బులు దీర్ఘకాలంలో మలవిసర్జన ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ కలిగించడం, అది క్రమంగా ఫిషర్‌కు దారితీయడం కూడా జరగవచ్చు. * సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి దీర్ఘకాలంలో ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడం జరిగి ఫిషర్ ఏర్పడవచ్చు. * ఇక మహిళల్లో ప్రసవం సమయంలోనూ మలద్వారం చీరుకుపోయి ఫిషర్ రావచ్చు. * కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడం (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్‌కు దారితీయవచ్చు. శస్త్రచికిత్స ప్రక్రియలు ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి... స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి. ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్పరిణామాలు ఫిషర్‌కు శస్త్రచికిత్స వల్ల కలిగే మేళ్లతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిషర్‌కు శస్త్రచికిత్స చేశాక, అది నిర్వహించిన ప్రాంతం గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం కూడా కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకే ‘ఫిస్టులా’ అనే కండిషన్కూ దారితీయవచ్చు. ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి... అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఇన్‌కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్‌కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్ల ఆధ్వర్యంలోనే ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ విషయంలో మరో హెచ్చరిక... సాధారణంగా ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే పరవాలేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో చేసే శస్త్రచికిత్స తర్వాత కూడా ఒక శాతం నుంచి ఆరు శాతం కేసుల్లో ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకుని మానసికంగా సిద్ధపడే శస్త్రచికిత్సకు ముందుకెళ్లాలి. ఫిషర్ సమస్య వ్యక్తిగతంగా, సామాజికంగా ఇలా అన్నిరకాలుగా ఇబ్బందికరం. పైగా పూర్తిగా తగ్గించాలని చేసే శస్త్రచికిత్సతోనూ కొన్ని దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటే... దీనికి చికిత్స కంటే నివారణ చాలా సులభం కాబట్టీ అంటే... కేవలం వేళకు భోజనం చేయడం వంటి మంచి ఆహారపు అలవాట్లు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు, నీళ్లు ఎక్కువగా తాగడం, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలతోనే దీని నివారణ జరిగిపోతుంది కాబట్టి వాటిని ఫిషర్ ఉన్నా లేకున్నా అందరూ ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల అసలు ఫిషర్ రాకుండానే నివారించుకోవచ్చునని గుర్తుంచుకోండి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
డేంజరస్ హెపటైటిస్...
‘‘పునరాలోచించండి...’’ ఇదీ ఈ ఏడాది ప్రపంచ హెపటైటిస్ డే థీమ్‌గా నిర్ణయించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) దాని అనుబంధంగా ఆరోగ్య రంగంలో పనిచేసే అనేక రంగాలకు చెందిన నిపుణులు. హెపటైటిస్ గురించి పునరాలోచించాలంటూ వీళ్లంతా అన్ని దేశాల ప్రభుత్వాలనూ, విధాన నిర్ణేతలనూ, ఆరోగ్య కార్యకర్తలనూ, చికిత్సారంగ నిపుణులనూ ఎందుకు కోరుతున్నారు? ఎందుకంటే... హెపటైటిస్ చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రాణం తీసుకోగలదు. ప్రపంచ జనాభాలో చాలామంది హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, అది తమకు ఉన్నట్లే తెలియదు. అందుకే ఈ థీమ్ అవసరం ఏర్పడింది. హెపటైటిస్పై సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం... హెపటైటిస్ అంటే... నిజానికి హెపటైటిస్ అనేది ఒక జబ్బు కాదు. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్ ఏ; బి; సి; డి; ఈ అనే ఐదు రకాల హెపటైటిస్‌లు కోట్లాది మంది ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. పై ఇన్ఫెక్షన్లలో దేనికైనా గురైన వారికి దీర్ఘకాలంలో క్రమంగా కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ వ్యాధితో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటీ యాభై లక్షల మంది మరణిస్తున్నారు. హెపటైటిస్ అన్న పదం గ్రీకు నుంచి వచ్చింది. ఈ పదంలోని మొదటిభాగం ‘హెపార్ స్టెమ్ ఆఫ్ హిప్యాట్’... అంటే కాలేయం అనీ, ‘ఐటిస్’ అంటే ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) అని అర్థం. A- హెపటైటిస్ చాలా సందర్భాల్లో ఈ వ్యాధి ఉన్నవారికి (ముఖ్యంగా యుక్తవయస్కుల్లో) బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు. ఇలా వ్యాధి సోకిన నాటి నుంచి లక్షణాలు బయటకు కనిపించడానికి రెండు నుంచి ఆరు వారాలు పట్టవచ్చు. ఇక లక్షణాలు కనిపించేవారిలో వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. ఇది సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధి కాదు. చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇది సంభవించిన ఒక శాతం మందిలో ఇది మరణానికి దారితీస్తుంది. వ్యాప్తి ఇలా: ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాప్తిచెందుతుంది. మలవ్యర్థాలు తాగు నీటితో కలవడం వల్ల కలుషితమైనా లేదా ఆ నీటితో పదార్థాలు తయారు చేయడం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. అంటే సురక్షితం కాని నీరు, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోటీ నలభై లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు: హెపటైటిస్- ఏ తీవ్రత స్వల్పం మొదలుకొని తీవ్రం వరకు ఉండవచ్చు. ఈ వైరస్ ఉన్నవారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, కడుపులో ఇబ్బంది, మూత్రం పచ్చగా రావడం, కామెర్లు (చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుగా మారడం) కనిపించవచ్చు. అందరిలోనూ అన్ని లక్షణాలూ ఉండకపోవచ్చు. నిర్ధారణ: హెపటైటిస్- ఏ ను కేవలం బయటి లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ వైరస్‌ను నిర్ధారణ చేసే ప్రత్యేక రక్తపరీక్ష ఆధారంగా యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. దీనితో పాటు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) అనే మరో అదనపు పరీక్ష కూడా ఈ వైరస్ నిర్ధారణ కోసం చేసేదే. ప్రత్యేకమైన ల్యాబ్‌లలో ఈ పరీక్ష ద్వారా ఈ వైరస్ తాలూకు ఆర్ఎన్ఏను గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. చికిత్స: ఈ వ్యాధి చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కాలేయానికి భారం పడని విధంగా తేలికపాటి ఆహారం, లక్షణాలను బట్టి చేసే చికిత్సలు (సింప్టమాటిక్ ట్రీట్మెంట్స్) చేస్తే చాలు. లక్షణాలు తగ్గడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక్కోసారి వారాలు మొదలుకొని నెలలు కూడా పట్టవచ్చు. నివారణ: సురక్షితమైన, పరిశుభ్రమైన నీరు తాగడం / వాడటం ఆరుబయట మల విసర్జన లాంటి అలవాట్లు మానుకుని, మలం బయటకు కనిపించని విధంగా కట్టించిన టాయెలెట్లలోనే మలవిసర్జన చేయడం (దీని వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి). వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం (అంటే భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత పరిశుభ్రంగా కాళ్లూ,చేతులు కడుక్కోవడం వంటివి). వ్యాక్సిన్: హెపటైటిస్-ఏ కు చాలారకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఏదైనప్పటికీ అవన్నీ ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించే విధానం మాత్రం ఒకటే. అయితే ఏడాది లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి లేదు. కేవలం ఒక్క మోతాదు వ్యాక్సిన్‌తో నెల రోజుల్లోనే ఈ వ్యాధి పట్ల నూరు శాతం భద్రత ఒనగూరుతుంది. B- హెపటైటిస్ ఇది హైపటైటిస్లోని అన్ని వైరస్లలోనూ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి ఏటా రెండు బిలియన్ ప్రజల్లో వారికి తెలియకుండానే ఈ వైరస్ ఉంది. 35 కోట్ల మందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధి (క్రానిక్)గా మారి వేధిస్తోంది. వ్యాప్తి ఇలా: ఇది ఎంత చురుకైనదంటే... సూదిపోటు ద్వారా వ్యాపించడం అనే ఒక్క అంశంలోనే హెచ్ఐవీతో పోలిస్తే దాదాపు 50 నుంచి 100 రెట్లు వేగంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ప్రతి ఏటా దాదాపు 7,80,000 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఇది ప్రధానంగా మూడు రకాలుగా వ్యాపిస్తుంది. గర్భవతి వ్యాధిగ్రస్తురాలైతే... తల్లి నుంచి బిడ్డకూ సోకుతుంది. లేదా మరీ నెలల పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది సెక్స్ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఇక ఒకరు వాడిన ఇంజెక్షన్ సూది మరొకరు వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది. అలాగే సరైన పరిశుభ్రత పాటించకుండా వేసుకునే పచ్చబొట్టు పరికరాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఎంత ప్రమాదకరమైనదంటే.. : హెచ్ఐవీ వైరస్‌ను మానవ శరీరం నుంచి వేరు చేయగానే కొద్ది క్షణాల్లోనే అది మరణిస్తుంది. కానీ హెపటైటిస్-బి వైరస్ వ్యక్తి శరీరం బయటకు వచ్చాక కూడా కనీసం ఏడురోజుల పాటు సజీవంగా ఉండగలదు. అందుకే దీని వ్యాప్తి చాలా వేగవంతం, తీవ్రం. వ్యాక్సిన్ వేయని వ్యక్తిని రక్తమార్పిడి వల్లనో, సెక్స్ వల్లనో లేదా సూదిపోటు వల్లనో వ్యాపించడం జరిగితే అది అతి వేగంగా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక దాదాపు 30 నుంచి 180 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. అంటే సగటున 75 రోజుల్లో బయటపడవచ్చు. లక్షణాలు: వ్యాధి సోకిన కొందరిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం కామెర్లు, మూత్రం చాలా పచ్చగా రావడం, తీవ్రమైన అలసట, నీరసం, వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వైరస్ దీర్ఘకాలంగా కాలేయంపై ప్రభావం చూపితే అది సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా పరిణమించవచ్చు. అయితే అదృష్టవశాత్తు 90 శాతం మంది యువకుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోవచ్చు కూడా. నిర్ధారణ: చాలా సాధారణ రక్త పరీక్షతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఇదే పరీక్షతో రక్తంలో వైరస్ తీవ్రతనూ తెలుసుకరోవచ్చు. చికిత్స: దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. కేవలం సమతుల ఆహారం ఇస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచడం, తరచూ ఎదురయ్యే లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వడం (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే ఈ వ్యాధి ఉన్నవారికి చేయగల చికిత్స. ఈ వ్యాధి ఉన్న రోగుల్లో కాలేయంపై దాని ప్రభావ తీవ్రతను బట్టి ఇంటర్ఫెరాన్, యాంటీవైరల్ ఏజెంట్స్ వంటి మందులు ఇస్తారు. ఒకవేళ దీని కారణంగా కాలేయ క్యాన్సర్ వస్తే... దాన్ని చాలా త్వరితంగా గుర్తించినప్పుడు క్యాన్సర్‌కు గురైన భాగం వరకు తొలగించవచ్చు. నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఈ వ్యాక్సి పిల్లలకు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. ఇక చిన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వని 18 ఏళ్ల లోపు వారికి (ఆ ప్రాంతంలో హెపటైటిస్-బి వ్యాప్తిని గుర్తిస్తే) వ్యాక్సిన్ ఇప్పించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. దీనితోపాటు రిస్క్ గ్రూప్‌లో ఉన్నవారు అంటే... చికిత్సారంగంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, డయాలసిస్ పేషెంట్స్, ఇంజెక్షన్స్ చేయించుకునే వారు, సెక్స్వర్కర్స్, ఒకరి కంటే ఎక్కువగా సెక్స్ భాగస్వాములు ఉన్నవారు, దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. C - హెపటైటిస్ ఇది చాలామందిలో, చాలావరకు దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్. కానీ కొద్దిమందిలో ఇది స్వల్పకాలిక ఇన్ఫెక్షన్గా కూడా ఉండవచ్చు. ఇది సోకిన వారిలో 15% నుంచి 45% మందిలో ఆర్నెల్లలో వ్యాధి దానంతట అదే ఆకస్మికంగా తగ్గిపోతుంది. మిగతా 55% నుంచి 85% మందిలో అది దీర్ఘకాలిక హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్గా పరిణమిస్తుంది. అయితే ఈ వ్యాధి వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చేందుకు చాలా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న 15% నుంచి 30% మందిలో ఇది సిర్రోసిస్‌గా పరిణమించడానికి 20 ఏళ్లు కూడా పడుతుంది. వ్యాప్తి ఇలా: ఇది సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడే వైద్య పరికరాలతో ముఖ్యంగా ఒకరు వాడిన ఇంజెక్షన్ సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాప్తి చెందుతుంది. సెక్స్ వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. గర్భవతికి ఇది ఉంటే బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉంది. లక్షణాలు: వైరస్ సోకాక లక్షణాలు బయటపడటానికి రెండు వారాల నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. 80 శాతం మందిలో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో జ్వరం, నీరసం/అలసట, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, మలం నల్లరంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: లక్షణాలు బయటకు కనిపించని కారణంగా సోకిన తర్వాత తొలి దశల్లోనే దీన్ని గుర్తించడం అరుదుగా జరుగుతుంది. అందుకే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పరిణమించినవారిలో అది కాలేయాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాకే బయటపడుతుంది. దీని నిర్ధారణ ప్రక్రియల్లో భాగంగా రక్తపరీక్షతో సీరలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్‌ను గుర్తించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ఫలితం పాజిటివ్ అని వస్తే అప్పుడు మరో వైద్య పరీక్ష చేస్తారు. ఇందులో హెచ్‌సీవీ ఆర్ఎన్ఏ ను గుర్తించడానికి ఒక న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష చేస్తారు. ఇది పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్ష. ఇది చేయాల్సిన అవసరం ఏమిటంటే... దాదాపు 15 శాతం నుంచి 45 శాతం మందిలో ఈ వ్యాధి సోకి దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్ పరీక్ష చేస్తే అది పాజిటివ్ అని వస్తుంది. కాబట్టి అసలు వ్యాధి ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఆర్ఎన్ఏ ని గుర్తించే న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష అవసరం. ఇక రోగికి హెపటైటిస్-సి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది కాలేయాన్ని ఏ మేరకు ప్రభావితం చేసింది (ఫైబ్రోసిస్ / సిర్రోసిస్) అన్న అంశాన్ని తెలుసుకునే పరీక్ష చేస్తారు. ఇందుకోసం కొందరిలో బయాప్సీ లేదా మరికొందరిలో ఇతర మార్గాలను అనుసరిస్తారు. దీనితో పాటు కొన్ని ల్యాబ్ పరీక్షలూ అవసరమే. ఎందుకంటే వైరల్లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు ఈ వైరస్‌లోనే ఆరు రకాల జీనోటైప్లు ఉంటాయి. ఒక జీనోటైప్ వైరస్‌కు ఇచ్చే చికిత్స మరో జీనోటైప్కు పనిచేయదు. కాబట్టి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది నిర్దిష్టంగా ఏ జీనోటైప్ అన్నది తెలుసుకోవడం చికిత్స కోసం చాలా అవసరం. దీని ఆధారంగానే చేయాల్సిన చికిత్సనూ, వ్యాధిని అదుపులో ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలనూ నిర్ణయిస్తారు. నివారణ: ఇప్పటివరకూ హెపటైటిస్-సి కి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాపించే మార్గాలను తెలుసుకుని, వాటినుంచి దూరంగా ఉండటమే మంచి నివారణ చర్య. కొన్ని సమర్థమైన నివారణ చర్యలివే.... చేతులు శుభ్రంగా ఉంచుకోవడం; చికిత్సారంగంలో ఉన్నవారు సర్జికల్ గ్లౌజ్ వంటివి వాడటం, గ్లౌజ్ వేసుకునే ముందర చేతులు శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవడం. చికిత్సరంగంలో ఉపయోగించిన వ్యర్థాలను సమర్థంగా పారేయడం (సేఫ్ డిస్పోజింగ్) అన్ని ఉపకరణాలను శుభ్రంగా ఉంచుకోవడం స్టెరిలైజ్ చేసుకోవడం వంటివి నివారణ చర్యల్లో కొన్ని. D- హెపటైటిస్ ఇది వర్తులాకరంలో ఉన్న చాలా చిన్న ఆర్ఎన్ఏ కలిగి ఉండే వైరస్. దీన్ని ఒక పూర్తిస్థాయి వైరస్‌గా కాకుండా ఒక ఉప-వైరస్‌లాగే పరిగణిస్తారు. ఎందుకంటే హెపటైటిస్-బి అండ లేకుండా ఇది స్వతంత్రంగా వ్యాప్తిచెందలేదు. కాబట్టి ఇది హెపటైటిస్-బితో పాటూ రావచ్చూ (కో-ఇన్ఫెక్షన్)... లేదా హెపటైటిస్-బి వచ్చాక ఆ తర్వాతా రావచ్చు (సూపర్ ఇన్ఫెక్షన్). అది కో-ఇన్ఫెక్షన్ అయినప్పటికీ లేదా సూపర్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఒకవేళ ఇది వస్తే మాత్రం కేవలం హెపటైటిస్-బి ఉన్నప్పటి కంటే కాలేయం పై తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే లివర్ ఫెయిల్యూర్ చాలా వేగంగా జరగడం లేదా సిర్రోసిస్ కండిషన్/కాలేయ క్యాన్సర్ రావడం వంటివి చాలా త్వరితంగా రావడం జరగవచ్చు. కేవలం హెపటైటిస్-బి మాత్రమే ఉన్నవారితో పోలిస్తే దాంతోపాటు హెపటైటిస్-డి కూడా ఉన్నప్పుడు రోగి మరణాల రేటు ఎక్కువ. (దాదాపు 20 శాతం ఎక్కువ). వ్యాప్తి ఇలా: హెపటైటిస్-బి వ్యాపించే అన్ని మార్గాల్లోనూ ఇది కూడా వ్యాపిస్తుంది. కాబట్టి హెపటైటిస్-బి వ్యాప్తిని నిరోధించే మార్గాలే ఈవ్యాధి నివారణకూ తోడ్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా కోటీ యాభై లక్షల మందిలో ఇది హెపటైటిస్-బి వైరస్‌తో పాటూ ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో దీని ఉనికి అంతగా లేనప్పటికీ, డ్రగ్స్ వాడే వారిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. చికిత్స / నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ కూడా దీని బారి నుంచి రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే అది హెపటైటిస్-బి సోకితేనే వస్తుంది కాబట్టి ఈ తరహా రక్షణ లభిస్తుందన్నమాట. ఇక హైపటైటిస్-బి నివారణ కోసం అవలంబించాల్సిన అన్ని జాగ్రత్తలనూ దీని వ్యాప్తి నివారణకూ అవలంబించాలి. E- హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ హెపటైటిస్-ఈ అనే వైరస్ వల్ల సోకుతుంది. ఇది కూడా కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. చాలావరకు ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. సాధారణంగా నాలుగు నుంచి ఆరువారాల్లో పూర్తిగా తగ్గుతుంది. అయితే చాలా అరుదుగా కొందరిలో లివర్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడి అది మృత్యువుకు దారితీయవచ్చు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్తరోగులు దీని బారిన పడుతున్నారు. వ్యాప్తి ఇలా: సాధారణంగా మలంతో కలుషితమైన నీరు మంచినీటితో కలవడం వల్లనే ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కలుషితమైన ఆహారం, నీటిని పూర్తిగా నివారించాలి. కేవలం సురక్షితమైన నీటినే తాగాలి/ఉపయోగించాలి. అలాగే రక్తమార్పిడి, రక్తంతో సంబంధం ఉన్న చర్యల వల్ల కూడా వ్యాప్తిచెందుతుంది. ఇక గర్భవతికి ఇన్ఫెక్షన్ ఉంటే తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. ప్రధానంగా ఇది కలుషితమైన నీటి వల్లనే వస్తుంది కాబట్టి సురక్షితం కాని నీళ్లు తాగడం, ఉడికించని ఆహారం పదార్థాలు తీసుకోవడం అంత మంచిది కాదు. లక్షణాలు: హెపటైటిస్‌కు ఉండే అన్ని సాధారణ లక్షణాలూ దీనిలోనూ ఉంటాయి. అంటే... కామెర్లు (చర్మం, కళ్లలోని తెలుపు భాగం పచ్చగా మారడం, మూత్రం పచ్చగా రావడం, మలం తెల్లగా ఉండటం) ఆకలి పూర్తిగా లేకపోవడం (అనొరెక్సియా), కాలేయవాపు (హెపటోమెగాలీ), పొత్తికడుపులో నొప్పి, పొత్తికడుపు భాగాన్ని ముట్టుకుంటే కూడా నొప్పి (టెండర్నెస్) వికారం/వాంతులు జ్వరం. ప్రభావం: హెపటైటిస్-ఈ వల్ల కలిగే లక్షణాలు సాధారణంగా వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ చాలా అరుదుగా ఫల్మినెంట్ హెపటైటిస్ (అంటే కాలేయం పూర్తిగా వైఫల్యం కావడం) వంటి కండిషన్ ఏర్పడి మరణానికి దారితీయవచ్చు. గర్భిణుల్లో ఈ వైరస్ ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్కువ. సాధారణంగా ఈ వైరస్ సోకిన గర్భిణుల్లో 20 శాతం మంది మూడో త్రైమాసికంలో దీని వల్లనే మరణించిన దాఖలాలు ఉన్నాయి. చికిత్స: హెపటైటిస్-ఈ వ్యాధి చాలా వరకు దానంతట అదే తగ్గుతుంది. సమతుల ఆహారం ఇవ్వడం, లక్షణాలను బట్టి మందులు ఇవ్వడం (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే చేస్తారు. అయితే ఈ లక్షణాలు ఉన్న గర్భిణులను మాత్రం ఫల్మినెంట్ హెపటైటిస్ బారి నుంచి రక్షించడానికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తారు. ప్రస్తుతానికి హెపటైటిస్-ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా చాలా త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి