
డీఎస్సీని వెంటనే నిర్వహించాలి: ఉత్తమ్ డిమాండ్
హైదరాబాద్: టీచర్ల నియామకాలు అవసరంలేదనడం అన్యాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం తక్షణం డీఎస్సీని నిర్వహించి ఖాళీగా ఉన్న 24000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కమల్ నాథన్ కమిటీతో ముడిపెట్టి ఉద్యోగాల నోటిఫికేషన్లలో జాప్యం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.