సింగరేణి ఆర్జీ-1 డివిజన్ పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బుధవారం మధ్యాహ్నం సీ-28 నెంబర్ గల డంపర్ బోల్తా పడింది.
గోదావరిఖని : సింగరేణి ఆర్జీ-1 డివిజన్ పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బుధవారం మధ్యాహ్నం సీ-28 నెంబర్ గల డంపర్ బోల్తా పడింది. ప్రాజెక్టులోని ఫేజ్-1 ఏరియా 4వ సీమ్ వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న డంపర్ వాహనంలో స్టీరింగ్ రాడ్ లాక్ అయి తిరగకపోవడంతో పక్కనున్న మట్టి బర్మ్‌ను ఢీకొట్టి డంపర్ బోల్తాపడింది. దీంతో వాహనంలో బ్యాటరీలు ఆపరేటర్ కొమ్మిడి రాజిరెడ్డిపై పడడంతో అతను స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.