ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం | Each acre cultivated | Sakshi
Sakshi News home page

ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం

Published Fri, Sep 5 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం

ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం

 కోదాడటౌన్ : సాగర్ ఆయకట్టులో చివరి ఎకరా వరకు సాగునీటిని అందిస్తామని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరుతున్నందున స్థిరీకరించిన ఆయకట్టు మొత్తానికి నీటిని అందించేందుకు తగిన ప్రణాళికను తయారు చేశామన్నారు. ఇకనుంచి ఆంధ్రప్రాంత జలదోపిడీ ఉండదన్నారు. కాలువ ల డిజైన్ మేరకు నీటిని విడుదల చేస్తామని, నీటిని తక్కువ విడుదల చేసి పంటలు ఎండిపోవడానికి అధికారులు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ రంగానికి తగినంత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, వల్లూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement