సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు చర్చనీయాంశంగా మారాయి. ఈ స్థానం నుంచి అనూహ్యంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న విషయం విదితమే. వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు మినహాయిస్తే..మిగిలిన 178 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. తమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎర్రజొన్న, పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం రామ్మోహన్‌రావు గుర్తులను కేటాయించారు. ఈ ప్రక్రియ గురువారం రాత్రి వరకు కొనసాగింది. అభ్యర్థులకు ఆసక్తికరమైన గుర్తులను కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తినుబండారాలు, కూరగాయలు, పండ్లు, గృహోపకరణాల వంటి వాటిని ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాలో చేర్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత కాలం నాటి కల్వం (చిన్న సైజురోలు), రోకలి, ఇసుర్రాయి.. ఇలా క్రమంగా కనుమరుగవుతున్న వాటిని సైతం గుర్తులుగా అభ్యర్థులకు కేటాయించారు. క్రీడా సామగ్రి, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, వంటపాత్రల వంటివి కూడా అభ్యర్థుల గుర్తులుగా మారాయి.
ఇవీ గుర్తులు
అల్లం, పచ్చి మిరపకాయ, బెండకాయ, గోబిపువ్వు, బెంగుళూరు మిర్చి చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీం, కేకు, బఠానీలు, నూడుల్స్, రొట్టే, అన్నం పళ్లెం వేరుశనక్కాయలు, ద్రాక్ష పండ్ల గుత్తి, బేరి పండ్లు సెల్‌ఫోన్ చార్జర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, మౌస్, పెన్‌డ్రైవ్, వాటర్ హీటర్, స్విచ్ బోర్డు, రిమోట్, బ్రెడ్ టోస్టర్, టార్చ్‌లైట్, సీసీటీవీ కెమెరా
Comments
Please login to add a commentAdd a comment