
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. శనివారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఎలక్టోరల్ రోల్ ఎలా ఉంది.. ఎప్పటి వరకూ పూర్తి అవుతుందనే అంశం గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
ఈవీఎంలను పరిశీలించినట్లు.. వాటి వాడకం గురించి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్‌లలో సౌకర్యాల గురించి అధికారులతో చర్చించానన్నారు. ఫిబ్రవరి 22 నాటికి తుది ఓటర్ లిస్ట్‌ను ప్రచురిస్తామని ప్రకటించారు. అసెంబ్లీకి వాడిన ఈవీఎంలనే పార్లమెంటు ఎన్నికలకు వాడతామన్నారు.