నల్లగొండ : విద్యా వ్యాపారంగా మారింది. ప్రైవేటు పాఠశాలలు పోటాపోటీగా అధిక ఫీజులు వసూలు చేస్తూ హడలెత్తిస్తున్నాయి. ప్రైవేటు దోపిడీ పుణ్యమాని చదువుకునే స్థాయి నుంచి చదువు ‘కొందాం’ అనే పరిస్థితులు దాపురించాయి. ఏటికేడు ప్రైవేటు పాఠశాలలు వేలకొద్ది ఫీజులు పెంచడమే గాక విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. జూన్ నెల వచ్చిందంటేచాలు విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మో.. అని భయపడేలా పరిస్థితి ఉంది.
ఇంత జరుగుతున్నా చేతిలో చట్టాలను ఉంచుకుని ప్రయోగించని దుస్థితిలో జిల్లా విద్యాశాఖ ఉంది. వేసవి సెలవులు గురువారంతో ముగుస్తుడడంతో శుక్రవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కొత్త లక్ష్యాలతో సరికొత్త పాఠ్యపుస్తకాలతో బడిగడప తొక్కాల్సిన విద్యార్థులకు ఫీజుల మోత భారంగా మారనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 2,96,570, ప్రైవేటు విద్యార్థులు 2,41,6 89 మంది బడిబాట పట్టనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పించడంతోపాటు పాఠశాలల తెరవగానే విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎటొచ్చి ప్రైవేటు యాజమాన్యాలు వసూలు చేసే ఫీజులపై వి ద్యాశాఖ ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో అందినకాడికి దండుకుంటున్నారు. లక్షల ఆదాయానికి కక్కుర్తి పడి అనుమతి లేకుండానే సెక్షన్లు ఏర్పాటు చేసుకుని ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కుతూ విద్యాబోధన చేస్తున్నారు.
ఫీజుల బాదుడు...
ప్రైవేటు స్కూళ్లలో కనీస సదుపాయాలు లేకున్నా ప్రకటనలు, పబ్లిసిటీలతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు 1,400 ఉన్నాయి. దీంట్లో హైస్కూల్ స్థాయిలో 539 పాఠశాలలు ఉంటే...వీటికి దీటుగానే ప్రాథమిక పాఠశాలలు 518 ఉన్నాయి. అంటే ప్రాథమిక స్థాయిలోనే విద్యావ్యాపారం జోరుగా సాగుతోందని దీనిని బట్టి చెప్పొచ్చు. కొత్తగా స్థాపించిన స్కూల్ యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.
మిర్యాలగూడలో కొత్తగా స్థాపించిన ఓ స్కూల్లో నర్సరీ అడ్మిషన్ ఫీజు నెల రోజుల క్రితం రూ.35వేలు కాగా...ప్రస్తుతం దానిని రూ.50 వేలకు పెంచేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా యాజమాన్యాలు నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. 8 నుంచి పదో తరగతి వరకు అయితే రూ.20 వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నాయి.
పుస్తకాల మోత..యూనిఫాం భారం...
ప్రైవేటు పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రభుత్వ సరఫరా చేసే పాఠ్యపుస్తకాలనే బోధించాలని ఆదేశించింది. కానీ జిల్లాకు పన్నెండు లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 5 లక్షల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. దీనిన్నే అదనుగా తీసుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఏజెన్సీల నుంచి పుస్తకాలు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ కోసం రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఖర్చు వస్తుంది. ఇవిగాక యూనిఫాం, బ్యాగుల కొ నేందుకు మరింత భారవుంతోంది. ఒక్కో యూనిఫాం ధర రూ. 300 నుంచి రూ. 500 వరకు ఉంది.
చట్టాలు ఏం చెబుతున్నాయంటే....
జిల్లాలో అనుమతిలేని విద్యాసంస్థలను గుర్తించి మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డు మీద ప్రకటించాల్సిన విద్యాశాఖ ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలో అనుమతి లేని ప్రైవేటు విద్యాస ంస్థలు 30 ఉన్నాయి. జీఓ ఎం.ఎస్న ంబర్: 1, యాక్షన్ (1) 82 ప్రకారం అమనుతి లేకుండా విద్యాసంస్థల ప్రారంభం, ప్రచారం నేరం. ఇలా చేస్తే విద్యాహక్కు చట్టం మేర కు కనీసం ఆరు నెలల జైలు శిక్ష, లక్ష రూపాయాల వరకు జరిమానా విధించాలి.
దీంతో పాటు అధిక ఫీజుల నియంత్రణ చట్టం (డీ ఎఫ్ఆర్సీ) మేరకు కొత్తగా స్థాపించబడే స్కూళ్లు లేదా కొనసాగుతున్న పాఠశాలలు వివిధ పేర్లతో అడ్మిషన్లు చేయకూడదు. జీఓనంబర్: 91 ప్రకారం డీఎఫ్ఆర్సీ చట్టం మేరకు జాయింట్ కలెక్టర్, డీఈఓ, జిల్లా అడిట్ అధికారి, జిల్లా పే అండ్ అకౌంట్స్ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫీజుల నిర్ధారణ జరిగాలి. కానీ ఎక్కడా అమలు కావడం లేదు. ఈ చట్టం ప్రకారం పాఠశాల్లో విద్యార్థి చేరేందుకు దరఖాస్తు ఫీజు రూ.100కు మించరాదు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కు దాటి ఉండకూడదు. క మిటీ సూచించిన విధంగా రూ.5 వేలకు మించకుండా విద్యార్థులు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కాని విద్యాచట్టాలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కపించడం లేదు.
వామ్మో..జూన్ !
Published Thu, Jun 11 2015 11:21 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement