కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలి  | Election Campaign In Kottagudem Vanama Venkateswara Rao | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలి 

Published Fri, Nov 23 2018 6:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Election Campaign In Kottagudem Vanama Venkateswara Rao - Sakshi

మాట్లాడుతున్న వనమా వెంకటేశ్వరరావు 

సాక్షి,కొత్తగూడెం రూరల్‌: కొత్తగూడెంలో కాంగ్రెస్‌ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని ప్రజాకూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం పాల్వంచ, కొత్తగూడేనికి చెందిన టీఆర్‌ఎస్‌కు చెందిన యువతి, యువకులు వికలాంగులు భారీగా కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారికి వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వనించారు. ఉదయ్‌ భాస్కర్‌ నాయకత్వంలో రామవరం, వనందాస్‌ గడ్డ, పునుకుల గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు, రత్నానాయక్‌ నాయకత్వంలో సుజాతనగర్‌ మండలంలోని సర్వారం గ్రామ పంచాయితీ గొపతండాకు చెందిన 50 కుటుంబాలు, పాత పాల్వంచ, బాబుక్యాంప్‌లో మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో  కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అభివృద్ధి జరగాలంటే చేతిగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉద్యమనేత వలీబాబా, తూము చౌదరి, వాసిరెడ్డి మురళి, కనుకుంట్ల శ్రీను, యెర్రా కామేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
రామాటాకీస్‌ ఏరియాలో.. 
పట్టణంలోని 16వ వార్డు రామాటాకీస్‌ ఏరియాలో ప్రజాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్ధి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తు గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సత్యనారాయణ సింగ్, యూత్‌ బొందుగుల శ్రీదర్, విల్సన్‌బాబు, సయ్యద్‌ అహ్మద్, బొందుగుల జ్యోతి, సిర్ల ఉన్నారు.  
కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం  
కొత్తగూడెంరూరల్‌: కొత్తగూడెం పట్టణ పరిధిలోని 33వ వార్డులో కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు రక్మాంగధర్‌ బండారి ఆధ్వర్యంలో వనమా వెంకటేశ్వరరావు విజయం కోరుతూ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గోపు రవీందర్, రాజు, తిరుపతి, మహ్మద్‌ జాన్, మణికంఠ, మోఘనాధ్, రషీ, రాజు, దిపక్, నవీన్, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 
సీతంపేట గ్రామ పంచాయతీలో..  
సుజాతనగర్‌: ప్రజాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరావు గెలుపును కాంక్షిస్తూ బుధవారం రాత్రి సీతంపేట గ్రామ పంచాయతీలో నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బోడా హరినాయక్‌ మాట్లాడుతూ.. వనమా గెలుపున ఎవరూ ఆపలేరన్నారు. నాయకులు గుగులోత్‌ హరిదాస్, మత్రు, సక్రు, కృష్ణ, సురేష్‌ తదతరులు పాల్గొన్నారు. 
వనమా మనువరాళ్ల ప్రచారం 
 పాల్వంచ: పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్, గాంధీనగర్, కేసీఆర్‌ నగర్, సోనియా నగర్, రాజీవ్‌ నగర్‌ కాలనీల్లో వనమా మనువరాళ్లు డాక్టర్‌ అలేఖ్య, హర్షిణి, మనీషా గురువారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతాజీ, వసంత కుమార్, రేగళ్ల శ్రీను, జ్యోతి, శారద, రాంబాబు, సత్యం, ఆనంద్, కోటి, అక్బర్, వీరన్న, గణేష్, రాము, ప్రవీణ్, మహేష్, సురేష్, త్రిదేవ్, నిహాంత్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement