విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య | Electrical wires to hold the person to commit suicide | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య

Published Sat, May 17 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

Electrical wires to hold the person to commit suicide

పెద్దవూర, న్యూస్‌లైన్ : భార్యతో గొడవ పడి వ్యక్తి విద్యుత్ తీగలు పట్టుకుని ఓ యువకు డు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..  పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దబావితండాకు చెందిన రమావత్ బిచ్యా-బుజ్జి దంపతుల మొదటి కుమార్తె లక్ష్మీని దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ  పరిధిలోని బుడ్డతండాకు చెందిన లావూరి నెహ్రూ(27)కి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు.
 
 ఆర్థికంగా లేకపోవడంతో జీవనోపాధి కోసం నెహ్రూ భార్యాపిల్లలతో సహా ఒంగోలుకు వెళ్లి అక్కడ ఆటోను నడుపుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సుద్దబావితండాలో మఠం (పెద్దల) పండగకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
 
 పండగను బంధుమిత్రులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. పూటుగా మద్యం సేవించిన నెహ్రూ తన భార్య లక్ష్మీతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయా డు. రాత్రి 10.30 గంటల సమయం లో తాను చనిపోతున్నానని బంధువులకు, స్నేహితులతోపాటు భార్య, మా మ, తోడల్లుడులకు ఫోన్ చేశాడు. వా రు నెహ్రూ కోసం పరిసరాలలో వెతికా రు. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి తిరిగొచ్చారు. మండలంలోని తుమ్మచెట్టు స్టేజీ సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 నెహ్రూది పులి వచ్చే కథ..
 గతంలోనూ నెహ్రూ రెండు మూడు సార్లు తాను చనిపోతున్నానని ఫోన్లు చేసి ఉరుకులు పరుగులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో అతడు బంధువులు విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులు వ్యక్తి చని పోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని మృతుడి సెల్‌ఫోన్‌లో ఉన్న నంబ ర్లకు ఫోన్ చేసి మృతుడు నెహ్రూగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
 
 మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నా రు. మృతుడి భార్య లక్ష్మీ ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తాడిపర్తి శేషుబాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement