మోర్తాడ్ : వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అవి పంచాయతీలకు గుది బండలుగా మారాయి. బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థ పంచాయతీలపై ఒత్తిడి పెం చింది. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేతకూ వెనుకాడడం లే దు. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. పంచాయతీల ఆదాయం తక్కువగా ఉందని భావించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన హయాంలో పంచాయతీల వీధి దీపాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పంచాయతీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తప్పింది. అయితే, రాజశేఖరరెడ్డి మరణం తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను చెల్లించే ఆంశాన్ని మరుగున పడేశారు. అప్పటి నుంచి పంచాయతీల కు విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి.
అప్పటి నుంచే
2010 నుంచి గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల విద్యుత్ బిల్లులను ఎన్‌పీడీసీఎల్‌కు చెల్లిం చడం లేదు. గతంలో మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించేది. మేజర్ పంచాయతీల బిల్లులను మాత్రం పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాల్సి వచ్చేది. సర్పంచుల విజ్ఞప్తి మేర కు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పంచాయతీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించేలా చ ర్యలు తీసుకున్నారు.
ఆయన అధికారంలో ఉన్నంత కాలం పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా చేశారు. తరువాత ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పంచాయతీలు భారీగా బిల్లులు బకాయి పడ్డాయి. 2010 నుంచి ఇప్పటి వరకు రూ. 108 కోట్ల బకాయిలు జిల్లాలోని పంచాయతీలు విద్యుత్ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 72 మేజర్ పంచాయతీలకు సంబంధించి రూ. 51 కోట్లు, 646 మైనర్ పంచాయతీలకు సంబంధించి రూ. 57 కోట్ల బకాయిలు ఉన్నాయి.
తడిసి మోపెడు
మేజర్ పంచాయతీలలో ఒక్కొక్కటి రూ. 40 లక్షల నుంచి రూ. కోటి వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆదాయం తక్కువగా ఉండటంతో విద్యుత్ బిల్లులను చెల్లించే స్థితిలో పంచాయతీలు లేవు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీధి దీపాలు, రక్షిత నీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థ అధికారులు పంచాయతీలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఉన్నతాధికారుల హామీతో
గురువారం రాత్రి జిల్లాలోని అనేక గ్రామాల్లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఎంతో కొంత బకాయి చెల్లిస్తామని పంచాయతీ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో శుక్రవా రం నుంచి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. కాగా ప్రభుత్వం విద్యుత్ బకాయిల విషయంలో స్పష్టత ఇవ్వకపోతే పంచాయతీలకు ఇబ్బం ది తప్పేలా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి విద్యుత్ బకాయిలను చెల్లించి పంచాయతీలకు ఊర ట కలిగించాలని పలువురు సర్పంచులు కోరుతు న్నారు.
కరెంటు బిల్లులు కట్టలేక పంచాయతీలు విలవిల
Published Sun, Sep 21 2014 1:48 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement