
‘ఉపాధి’పనుల్లో ఎంపీటీసీ సభ్యురాలు
ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారంటే చాలు.. చుట్టూ మందీ మార్బలం ఉంటారు.. దర్పం ప్రదర్శిస్తుం టారు. కానీ, నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గంజాయి లక్ష్మీ మాత్రం ఉపాధి పనులకు వెళ్తున్నారు.
ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారంటే చాలు.. చుట్టూ మందీ మార్బలం ఉంటారు.. దర్పం ప్రదర్శిస్తుం టారు. కానీ, నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గంజాయి లక్ష్మీ మాత్రం ఉపాధి పనులకు వెళ్తున్నారు. మంగళవారం ఆమె పారపట్టి ట్రాక్టర్‌లో మట్టి నింపుతుం డగా, పనులను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీడీవో భరత్‌కుమార్ ఎంపీటీసీ సభ్యురాలిని చూసి అవాక్కయ్యారు. ‘మేడమ్ మీరు ఉపాధి హామీ పనికి వచ్చారా? అంటూ పలకరిం చా రు. దీంతో ’వర్షాల్లేక పొలం పనులు సాగడం లేదు. ఇంటి వద్ద ఊరికే కూర్చునే కంటే నలుగురితో కలసి ఉపాధి పనులకు వెళ్తే తప్పులేదని ఎంపీటీసీ లక్ష్మీ అన్నారు.
- బీర్కూర్