
రైతులకు రుణ మాఫీ...యువతకు ఉపాధి
- భూపాలపల్లి సభలోబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హామీ
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : బీజేపీ అధికారంలోకి వస్తే రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ, యువతకు ఉపాధి కల్పించడంతోపాటు మహిళలపై అత్యాచారాలు, ఉగ్ర వాదాన్ని అరికడతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల సమీప మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
సింగరేణి కార్మికులకు ఇన్‌కాంట్యాక్స్ రద్దు, భూపాలపల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులను తగ్గించి భూగర్భగనులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కేటీపీపీలోని క్యాజు వల్, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు మరో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నెల కొల్పుతామన్నారు. బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పా టు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చా రు.
బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి రామగళ్ల పరమేశ్వర్, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావులను గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు. పార్టీ రాష్ట్ర నేతలు, సినీ నటులు రాజశేఖర్, జీవిత మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రధాని అయితే పేద, మధ్యతరగతి ప్రజల బాధలు తీరుతాయని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాందాడి సత్యనారాయణరెడ్డి, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎడబోయిన బస్వారెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.