తెలంగాణలో పిట్టలదొర పాలన | errabelli dayakar rao fires on kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పిట్టలదొర పాలన

Published Sat, May 16 2015 5:57 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

తెలంగాణలో పిట్టలదొర పాలన - Sakshi

తెలంగాణలో పిట్టలదొర పాలన

వికారాబాద్ (రంగారెడ్డి జిల్లా) : తెలంగాణ రాష్ట్రంలో పిట్టలదొర పాలన సాగుతోందని, ఒక కుటుంబానికి చెందిన నలుగురే  రాష్ట్రాన్ని పాలిస్తున్నారని శాసనపక్ష నేత , పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... రానున్న ఆరు నెలల్లో టీఆర్‌ఎస్ నాయకులను ప్రజలు తరిమికొడతారన్నారు. 2019లో తెలంగాణలో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. టీడీపీ పార్టీ ఖాళీ అవుతుందంటున్న కేసీఆర్ ఫౌంహౌస్‌లో కూర్చుని బ్రాందీ సీసాలు ఖాళీ చేస్తున్నారన్నారు. ప్రజల్లో టీఆర్‌ఎస్కు పట్టులేదని తెలిసే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను పెట్టలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ పార్టీకి మంచి ఆదరణ ఉందని, దాన్ని గుర్తించి కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం తేవడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement