
హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఈశ్వరీబాయి అని పార్లమెంట్‌లో కాం గ్రెస్ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే శక్తులను అడ్డుకున్నప్పుడే ఈశ్వరీబాయికి నిజమైన నివా ళ్లు అర్పించినట్లని చెప్పారు. బుధవారం ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు.
కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ఈశ్వరీబాయి మెమోరియల్ సెంచ రీ అవార్డును ప్రజా గాయకుడు గద్దర్‌కు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు వి.హన్మంతరావు, మధుయాష్కి, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్‌పర్సన్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి కె.రత్నప్రభ, రామన్ మెగసెసే అవార్డు గ్రహిత ప్రొఫెసర్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment