jayanthi ustavalu
-
ముగిసిన నృసింహుడి జయంత్యుత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు ఆదివారం ముగిశాయి. ప్రధానాలయంలో నిత్య హవనాలు నిర్వహించిన అనంతరం ప్రథమ ప్రాకారంలోని యాగశాలలో పూర్ణాహుతి, ముఖమండపంలో సహస్ర కలశాలకు పూజలు, స్వయంభువులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ ప్రవచనం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి, మంగళ నీరాజనం చేసి ఉత్సవాలను ముగించారు. యాదాద్రిలో భక్తుల రద్దీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవురోజు కావడం, స్వామి జయంతి, స్వాతి నక్షత్రం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, గండి చెరువుతో పాటు ఆలయ పరిసరాలన్నీ రద్దీగా మారాయి. 30 వేలకుపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, అతి శీఘ్ర దర్శనానికి 45 నిమిషాలకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈశ్వరీబాయి
హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఈశ్వరీబాయి అని పార్లమెంట్లో కాం గ్రెస్ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే శక్తులను అడ్డుకున్నప్పుడే ఈశ్వరీబాయికి నిజమైన నివా ళ్లు అర్పించినట్లని చెప్పారు. బుధవారం ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ఈశ్వరీబాయి మెమోరియల్ సెంచ రీ అవార్డును ప్రజా గాయకుడు గద్దర్‌కు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు వి.హన్మంతరావు, మధుయాష్కి, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి కె.రత్నప్రభ, రామన్ మెగసెసే అవార్డు గ్రహిత ప్రొఫెసర్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గాంధీ 150వ జయంత్యుత్సవాలు
విజయనగరం అర్బన్ : భావితరాలకు మహాత్మాగాంధీ జీవిత విశేషాలు తెలియజేసేందుకు ఆయన 150వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి సంస్థ జిల్లా కమిటీ ప్రకటించింది. స్థానిక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో విద్యాసంస్థల ద్వారా భావి భారత పౌరులకు గాంధీ జీవిత విశేషాలను తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ఆగస్టు 15 సందర్భాన్ని పురస్కరించుకొని కవులు, రచయితలతో కలసి గాంధీ జీవితంపై ఒక గోష్టిని నిర్వహించాలని సభ్యులు కోరారు. సంస్థను బలోపేతం చేయడానికి పట్టణ, మండల కమిటీలను నిర్మిస్తామని పేర్కొన్నారు. స్మారకనిధి జిల్లా కన్వీనర్ డాక్టర్ డొల్లు పారినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రొంగలి పోతన్న, ఉపాధ్యక్షుడు పెద్దిండి అప్పారావు, సభ్యులు పీవీ నరసింహరాజు, సూర్యలక్ష్మి, డాక్టర్ పీవీఎల్ సుబ్బారావు, త్రినాథ్ ప్రసాద్, శివకేశవరావు, ప్రకాశరావు, షేక్ బాషా, మురళీభగవాన్, అప్పలనాయుడు, దాసరి తిరుపతినాయుడు పాల్గొన్నారు. -
రేపటి నుంచి నృసింహుని జయంత్యుత్సవాలు
యాదగిరికొండ: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నరసింహస్వామి జయంత్యుత్సవాలు జరగనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. బుధవారం లక్ష కుంకుమార్చన , గురువారం లక్ష పుష్పార్చన, శుక్రవారం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. -
నేడు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్ : బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాలను నగరంలో ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని బషీర్‌బాగ్ లో జరిగే జయంతి ఉత్సవాలలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.