యాదగిరికొండ: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నరసింహస్వామి జయంత్యుత్సవాలు జరగనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. బుధవారం లక్ష కుంకుమార్చన , గురువారం లక్ష పుష్పార్చన, శుక్రవారం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
రేపటి నుంచి నృసింహుని జయంత్యుత్సవాలు
Published Tue, May 17 2016 7:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement