సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యులు
విజయనగరం అర్బన్ : భావితరాలకు మహాత్మాగాంధీ జీవిత విశేషాలు తెలియజేసేందుకు ఆయన 150వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి సంస్థ జిల్లా కమిటీ ప్రకటించింది.
స్థానిక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో విద్యాసంస్థల ద్వారా భావి భారత పౌరులకు గాంధీ జీవిత విశేషాలను తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు
ఇందులో భాగంగా ఆగస్టు 15 సందర్భాన్ని పురస్కరించుకొని కవులు, రచయితలతో కలసి గాంధీ జీవితంపై ఒక గోష్టిని నిర్వహించాలని సభ్యులు కోరారు. సంస్థను బలోపేతం చేయడానికి పట్టణ, మండల కమిటీలను నిర్మిస్తామని పేర్కొన్నారు.
స్మారకనిధి జిల్లా కన్వీనర్ డాక్టర్ డొల్లు పారినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రొంగలి పోతన్న, ఉపాధ్యక్షుడు పెద్దిండి అప్పారావు, సభ్యులు పీవీ నరసింహరాజు, సూర్యలక్ష్మి, డాక్టర్ పీవీఎల్ సుబ్బారావు, త్రినాథ్ ప్రసాద్, శివకేశవరావు, ప్రకాశరావు, షేక్ బాషా, మురళీభగవాన్, అప్పలనాయుడు, దాసరి తిరుపతినాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment