yadagirir gutta
-
పంద్రాగస్టులోపు జిల్లాను ప్రకటించాలి
యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జిల్లాల పునర్ విభజన ఈనెల 15వ తేదీలోపు ప్రకటించాలని, అందులో యాదాద్రి జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా చూడాలని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్టలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల యాదాద్రి జిల్లా సాధన కోసం ప్రారంభించిన 10వేల పోస్టుకార్టులు, లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం పూరై్తందని, ఈ కార్డులను ఈనెల 5న శ్రీలక్ష్మీనరసింహస్వామి సింహద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి తపాలా కార్యాలయంలో సమర్పిస్తామని వెల్లడించారు. ఈ కార్డులు తపాలా సిబ్బంది సీఎం కేసీఆర్‌కు అందిస్తారన్నారు. యాదాద్రి జిల్లాను అధికారికంగా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టీడీపీ మండల అధ్యక్షులు దడిగె ఇస్తారి, కొల్లూరి రాజయ్య, చంద్రగిరి శ్రీనివాస్, బబ్బూరి శ్రీధర్‌గౌడ్ తదితలున్నారు. -

రేపటి నుంచి నృసింహుని జయంత్యుత్సవాలు
యాదగిరికొండ: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నరసింహస్వామి జయంత్యుత్సవాలు జరగనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. బుధవారం లక్ష కుంకుమార్చన , గురువారం లక్ష పుష్పార్చన, శుక్రవారం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.