పంద్రాగస్టులోపు జిల్లాను ప్రకటించాలి
పంద్రాగస్టులోపు జిల్లాను ప్రకటించాలి
Published Mon, Aug 1 2016 7:48 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM
యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జిల్లాల పునర్ విభజన ఈనెల 15వ తేదీలోపు ప్రకటించాలని, అందులో యాదాద్రి జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా చూడాలని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్టలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల యాదాద్రి జిల్లా సాధన కోసం ప్రారంభించిన 10వేల పోస్టుకార్టులు, లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం పూరై్తందని, ఈ కార్డులను ఈనెల 5న శ్రీలక్ష్మీనరసింహస్వామి సింహద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి తపాలా కార్యాలయంలో సమర్పిస్తామని వెల్లడించారు. ఈ కార్డులు తపాలా సిబ్బంది సీఎం కేసీఆర్‌కు అందిస్తారన్నారు. యాదాద్రి జిల్లాను అధికారికంగా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టీడీపీ మండల అధ్యక్షులు దడిగె ఇస్తారి, కొల్లూరి రాజయ్య, చంద్రగిరి శ్రీనివాస్, బబ్బూరి శ్రీధర్‌గౌడ్ తదితలున్నారు.
Advertisement
Advertisement