సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలిందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కాగా అందులో కరోనా సోకిన ఒక వ్యక్తి కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయి వెళ్లిపోగా, మిగతా నలుగురు గాంధీలో చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వ్యక్తులకు మాత్రమే కరోనా వైరస్ సోకింది తప్ప రాష్ట్రంలో ఎక్కడా కేసు నమోదవ్వలేదు. (మాస్కుల కోసం ఎగబడొద్దు)
కరోనా సోకిన ఐదుగురు దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చినవారన్నారు. కాగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రధానంగా చైనా, ఇటలీ, స్పెయిన్, కొరియా దేశాల నుంచి వచ్చే వారిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నామన్నారు. కాగా అలా పెట్టినంత మాత్రానా వారందరికి కరోనా సోకలేదని,కేవలం వారందరు అనుమానుతులుగానే భావిస్తున్నట్లు ఈటెల పేర్కొన్నారు. వరంగల్‌లో కరోనా వైరస్ టెస్ట్ ల్యాబ్ కోసం కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో మొత్తం ఆరు ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేస్తున్నాయని, అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో థర్మల్ స్క్రీనింగ్ సదుపాయం ఏర్పాటు చేశామిన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, సలహాలతో రాష్ట్రంలో కరోనా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలకు కరోనాపై తోడ్పాటు ఇవ్వడంలో మీడియా అనేక సహాయ సహకారాలు అందించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment