సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఎలాంటి భద్రతా లోపాలు రావొద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. భారీ భద్రత నడుమ సాగబోతున్న ప్రధాని మోదీ, ఇవాంకా పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని సీనియర్ ఐపీఎస్ అధికారులకు సూచించారు. శుక్రవారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో ప్రత్యేక అధికారులతో కలసి సదస్సు భద్రత, ఫలక్‌నుమా, గోల్కొండ, ఇవాంకా బస ప్రాంతాల్లో బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు.
11 మంది అధికారులు శనివారం ఉదయం కల్లా వారికి కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్ట్ చేసి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. స్థానిక పోలీసులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ఎలాంటి అనుమానాలు వచ్చినా తనతో పాటు శాంతి భద్రతల అదనపు డీజీపీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో చర్చించాలని స్పష్టం చేశారు. డెలిగేట్స్ బస చేసే ప్రాంతాలు, వారుపర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, రూట్ క్లియరెన్స్, ట్రాన్స్‌పోర్టేషన్ తదితరాల్లో‡అవాంతరాలు ఉండకూడదని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కార్యక్రమం విజయవంతం చేసేందుకు కష్టపడాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment