
ప్రతి కుటుంబం ఓటు వైఎస్సార్‌సీపీకే..
మంకమ్మతోట, న్యూస్‌లైన్ :
దివంగతనేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవే శ పెట్టిన పథకాలతో లబ్ధిపొందిన ప్రతీ కుటుం బం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆ దివారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. గడపగడపకు వెళ్లి ఓటు అ డిగితే ఓటు వేస్తారని, ఆ దిశగా అభ్యర్థుల గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ప్రతి గ్రామంలో 18నుంచి 20 శాతం వైఎస్సార్‌సీపీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. రానున్న మున్సిప ల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అన్ని వి ధాలా వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. అన్ని ఎ న్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలని సూచించా రు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి టీఆర్‌ఎస్ తామే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చామని, కాంగ్రెస్ మేమే ఇచ్చామని, తాము మద్దతు ఇస్తేనే వ చ్చిందని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన ని, మైనార్టీకి చెందిన వారిని డెప్యూటీ సీఎం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మా టమార్చి తానే సీఎం కావాలని ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినవారు లక్షల్లో ఉన్నారని, అందులో కేసీఆర్ ఒక ఉద్యమకారుడు మాత్రమేనన్నారు. నగర కన్వీనర్ డాక్టర్ కె.నగేశ్ మాట్లాడుతూ గె లుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అందరికీ సమన్యాయం జరుగుతుందనే నమ్మకంతో ముందుకు పోవాల న్నారు. కరీంనగర్ నుంచే వైఎస్సార్ సీపీకి ప్ర భంజనం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశా రు.
ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపెల్లి కుమా ర్ మాట్లాడుతూ వైఎస్ చలువతో ఎంపీ అయిన కొందరు వైఎస్సార్ సీపీ అసత్య ఆరోపణలు చే స్తున్నారన్నారు. బీసీ సెల్ జిల్లా కన్వీనర్ వరాల శ్రీనివాస్, ఎస్టీసెల్ జిల్లా కన్వీనర్ ర ఘునాయక్, లీగల్‌సెల్ జిల్లా కన్వీనర్ విజయ్‌కుమార్, వి ద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ సందమల్ల నరేశ్, మహిళా విభాగం నగర కన్వీనర్ బోగెపద్మ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మోతె గంగారెడ్డి, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంట సుశీల, నాయకులు కట్ట శివ, ఎల్లారెడ్డి, మల్యాల ప్రతాప్, సొల్లు అజయ్‌వర్మ, వేణుమాధవ్‌రావు, పద్మారెడ్డి పాల్గొన్నారు.