
సాక్షి, రాయపర్తి : వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన నాగపూరి వెంకటేశ్వర్లు అనే మాజీ సర్పంచ్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం వెంకటేశ‍్వర్లు తన పొలానికి నీళ‍్లు కట్టెందుకు వెళ్లాడు. నెలపై తెగిపడిన విద్యుత్ తీగని గమనించకుండా తొక‍్కడంతో కరెంట్ షాక్ కొట్టి అక‍్కడికక‍్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబసభ‍్యులు కాపాడే ప్రయత‍్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment