
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ ప్లస్ వైఫై సేవలు విస్తరణ
తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం అనంతరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ ప్లస్ వైఫై సేవలను విస్తరిస్తున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంతరామ్ వెల్లడించా రు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటి విడత కింద 63 ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ ప్లస్ వైఫై సేవలు అందిస్తున్నామని, రెండో విడత కింద ఆగస్టులో మరో 58 ప్రాంతాల్లో కొత్తగా ప్రారంభించనున్నామని తెలిపారు. మరో 130 ప్రాంతాలు ప్రణాళికలో ఉన్నట్లు చెప్పారు. యూఎస్‌వో ప్రాజెక్టు కింది మరో 750 గ్రామీణ ఎక్సే్ఛచేంజ్ పరిధిలో వైఫై సేవలను విస్తరిస్తున్నామన్నారు. వైఫై హాట్‌స్పాట్స్, యాక్సిస్ పాయింట్ కింద మొబైల్, ల్యాబ్‌టాప్‌ల ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందవచ్చని చెప్పారు. కనీసం పది రూపాయల నుంచి 1,999 వరకు విలువ గల వోచర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ టెలికం వెబ్‌సైట్
తెలంగాణ టెలికం సర్కిల్ నూతన వెబ్‌సైట్ telangana.bsnl.co.in ను ప్రారంభించినట్లు సీజీఎం తెలిపారు. ఇందులో వినియోగదారులకు సుల భంగా అర్థమయ్యేలా ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బాండ్ మొబైల్, ఎఫ్‌టీటీహెచ్ ప్లాన్స్, వాటి టారిఫ్, ఆఫర్లు, బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు పొందుపర్చినట్లు చెప్పా రు.బీఎస్‌ఎన్‌ఎల్ సౌత్‌జోన్‌లో ఈ ఆర్థిక సంవత్సరం సిమ్ అక్టివేషన్ ఏపీ సర్కిల్ ప్రధమ స్ధానంలో ఉందని సీజీఎం వెల్లడించారు. మొబైల్ నెంబర్లకు ఆధార్‌తో రీ వేరిఫికేషన్ తప్పని సరి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆధార్ రీ–వెరిఫికేషన్ పూరి చేసుకోవాలన్నారు. ఎంసెట్, నీట్, జీలలో ర్యాంకు సాధించిన విద్యార్థి స్పూర్తి కోసం రూ.49 విలువగల ప్రతిభ ప్రీ పెయిడ్ స్కీంను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.మొబైల్, ల్యాండ్, బ్రాడ్ బాండ్ కనెక్షన్లపై çపలు కొత్త ఆఫర్లు వర్తిపజేస్తున్నట్లు ఆయన వివరించారు.